తెలుగు రాష్ట్రాలు

డీవోపీటీ ఆదేశాలతో ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు!

  • ఏపీకి కేటాయించినా ఇంకా తెలంగాణలోనే కొనసాగుతున్న ఐఏఎస్ లు
  • ఏపీకి వెళ్లాలంటూ ఇటీవల డీవోపీటీ ఆదేశాలు
  • క్యాట్ లోనూ, తెలంగాణ హైకోర్టులోనూ ఐఏఎస్ లకు నిరాశ
  • నిన్న సాయంత్రం తెలంగాణ నుంచి రిలీవ్ అయిన అధికారులు
  • నేడు ఏపీ సీఎస్ కు రిపోర్టు చేసిన రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్

రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి కేటాయించినప్పటికీ, తెలంగాణలోనే విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారులు… డీవోపీటీ ఆదేశాల నేపథ్యంలో ఎట్టకేలకు నేడు ఏపీలో రిపోర్టు చేశారు. ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి కాటా, రొనాల్డ్ రాస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్ ఏపీ సీఎస్ కు రిపోర్టు చేశారు. 

ఈ నలుగురు ఐఏఎస్ అధికారులు తెలంగాణలోనే కొనసాగేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. క్యాట్ ను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. తెలంగాణ హైకోర్టులోనూ వారికి చుక్కెదురైంది. దాంతో డీవోపీటీ ఆదేశాలను పాటించక తప్పలేదు. ఈ క్రమంలో నలుగురు ఐఏఎస్ అధికారులు నిన్న సాయంత్రం తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యారు.

Related posts

కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది: కేంద్రమంత్రితో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి

Ram Narayana

ఏపీ సీఎం చంద్రబాబును తన కుమారుడి  వివాహానికి ప్రత్యేక ఆహ్వానం పలికిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Ram Narayana

సంక్రాంతికి ప్రత్యేక బస్సులు… ఆ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం: టీజీఆర్టీసీ

Ram Narayana