Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గ్రూప్ వన్ అభ్యర్థులపై లాఠీ ఛార్జ్ దుర్మార్గం …పాతపద్ధతిలోనే పరీక్షా నిర్వహించాలి ..

రాష్ట్రంలో జీవో నెంబర్ 55 ప్రకారమే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని ఎస్ ఎఫ్ ఐ ,డివైఎఫ్ ఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి …తమ డిమాండ్స్ సాధనకోసం ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై లాఠీచార్జి చేయడాన్నిఎస్ ఎఫ్ ఐ ,డివైఎఫ్ ఐ లు తీవ్రంగా ఖండించాయి .. కోర్టు కేసులు లేకుండా అభ్యర్థులందరీ సమస్యలు పరిష్కరించి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని కమిటీలు డిమాండ్ చేశాయి… యూపీఎస్సీ తరహాలోనే ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్లతోనే మెయిన్స్ ఆన్సర్ బుక్లెట్స్ పై ముద్రించి పరీక్ష నిర్వహించాలని, ప్రస్తుతం అవలంబిస్తున్న జీవో 29 ప్రకారం జనరల్ కోటాలో ఎంపికైన రిజర్వ్ అభ్యర్థిలకి జనరల్ కోటాలో పరిగణించకుండా రిజర్వ్ కోటాలో పరిగణించి ఇతర అభ్యర్థులు నష్ట పోకుండా ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ పోరాటం చేస్తున్న అభ్యర్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం లాఠీ చార్జ్ చేయడం అమానుషమని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీలు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఈ లాఠీచార్జీనీ ఖండిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రశ్నిస్తున్న వారిపై లాఠీలతో దాడులు చేయకుండా సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ ఐ రాష్ట్ర కమిటీలు కోరుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రూప్-1 మొదటి సారిగా పరీక్ష ప్రిలిమ్స్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఏప్రిల్ 26వ తేదీన 503 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమినరీ పరీక్షను 16 అక్టోబర్ 2022న నిర్వహించింది. మొదటిసారి ఈ పరీక్షను పేపర్ లీకేజీ కారణంగా రద్దు చేయడం జరిగింది. తర్వాత మళ్లీ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. దానిని కూడా బయోమెట్రిక్ సమస్యలతో హైకోర్టు పరీక్షను రద్దు చేసింది. బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను పోస్టుల భర్తీకై రిజర్వేషన్ల విధానం కోసం జీవో నెంబర్ 55ను 25 ఏప్రిల్ 2022న తీసుకొచ్చింది. జీవో నెంబర్ 55 ప్రకారం మెయిన్స్కి ఎంపిక చేసిన అభ్యర్థులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటించి మెయిన్స్కు ఎంపిక చేయాలని నిర్ణయించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 60 పోస్టులను అదనంగా కలుపుతూ నూతన నోటిఫికేషను 563 పోస్టులతో జూన్ 9 2024ను ప్రిలీమ్స్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్ష ద్వారా మెయిన్స్కి ఎంపిక చేసేందుకు జీ.వో. నెంబర్. 29 ని 8- ఫిబ్రవరి-2024న తీసుకొచ్చింది. పాత జీ.వో.55 ను రద్దుచేసి జీ.వో. నెంబర్. 29 ఆధారంగానే ప్రిలిమ్స్ పరీక్ష రాసిన వారిలో నుండి 31,381 మంది అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేసింది. కానీ జీవో నెం. 29 తీసుకునివచ్చి జనరల్ కోటాలో ఎంపికైన రిజర్వ్ అభ్యర్థిలకి జనరల్ కోటాలో పరిగణించకుండా రిజర్వ్ కోటాలో పరిగణించి ఇతర అభ్యర్థులు నష్ట పోకుండా ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీలు కోరుతున్నాయి. యూపీఎస్సీ తరహాలోనే ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్లతోనే మెయిన్స్ ఆన్సర్ బుక్లెట్స్ పై ముద్రించి పరీక్ష నిర్వహించి, అభ్యర్థుల అనుమానాలు నివృత్తి చేయాలి. అలాగే ప్రిలిమ్స్ రాసిన ఓఎన్ఆర్అలో 3000ఓఎస్ఆర్ట్లు అదనంగా ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాలి.

=============================

=====================================

Related posts

లాలూ ప్రసాద్ కు బెయిల్ మంజూరు…

Drukpadam

ముద్రగడ, దాడిశెట్టి రాజా, సినీ నటుడు జీవీలకు ఊరట: తుని రైలు దగ్ధం కేసు కొట్టివేత…

Drukpadam

టీఆర్ఎస్ ఆందోళ‌న‌ల‌పై తెలంగాణ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు…

Drukpadam

Leave a Comment