ఆంధ్రప్రదేశ్

తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఐజేయూ నేషనల్ కౌన్సిల్ సభ్యులు మురళి ఎన్నిక

తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఐజేయూ నేషనల్ కౌన్సిల్ సభ్యులు మురళి ఎన్నిక
మురళికి అభినందనలు తెలిపిన ఐజేయూ నేతలు

తిరుపతి ప్రెస్ క్లబ్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో ఐజేయూ నేషనల్ కౌన్సిల్ సభ్యులు ఆర్ .మురళి ఎన్నికైయ్యారు … మురళి 10 టీవీ తిరుపతి ప్రాంతీయ సమన్వయకర్తగా పనిచేస్తున్నారు…సోమవారం జరిగిన ఎన్నికల్లో మురళి తన సమీప అభ్యర్థి పై 211 ఓట్లు భారీ మెజార్టీతో విజయం సాధించారు …ఏపీయూడబ్ల్యూజే చేస్తున్న ఉద్యమాలకు , జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్న విధానాలకు , కార్యక్రమాలకు ఆకర్షితులైన జర్నలిస్టులు ఐజేయూ అనుబంధంగా ఉన్న ఏపీయూడబ్ల్యూజే తోనే సమస్యలు పరిస్కారం అవుతాయని నమ్మి మద్దతు ప్రకటిసున్నారు …అందులో భాగంగానే తిరుపతి ప్రెస్ క్లబ్ కు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు ఉన్నాయని తెలుస్తుంది ..మురళి విజయం సాధించడం పట్ల ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు , ఐ వి సుబ్బ్బారావు , చందు జనార్దన్ , ఐజేయూ కార్యదర్శి డి .సోమసుందర్ ,ఐజేయూ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్, డాక్టర్ ఎం .ప్రసాద్ , ధర్మారావు అభినందలు తెలిపారు ..

Related posts

బీఆర్ఎస్ – బీజేపీ మైత్రి బంధంపై చర్చ తప్పుడు ప్రచారమన్న కిషన్ రెడ్డి

Drukpadam

పేదరికం లేని భారత్ నిర్మాణమే తమ లక్ష్యం …రాష్ట్రపతి ద్రౌపది ముర్ము !

Drukpadam

నిమిషాల వ్యవధిలోనే రెండు భారీ భూకంపాలు.. చిగురుటాకులా వణికిన టర్కీ.. 15 మంది మృతి!

Drukpadam