కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి ..
ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి కేటాయించాలి
ప్రమాదానికి శాశ్విత వికలాంగులకు 10 లక్షలు ,గాయాలైన వారికీ లక్ష రూపాయలు ఇవ్వాలి
50 సంవత్సరాలు నిండిన కార్మికులకు 5 వేల ఎక్సగ్రేషయో ఇవ్వాలి
ప్రతి గ్రామంలో కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేయాలి
ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేయాలి
కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు ఎం వి రమణ , ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు …మంగళవారం ఖమ్మం వచ్చిన వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కల్లుగీత వృత్తి చాల ప్రమాదకరమైనదని అయినప్పటికీ దాన్నే ఆధారం చేసుకొని లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయని అన్నారు …నిత్యం గౌడన్నలు ప్రాణాలు లెక్క చేయక కొనసాగుతున్న వృత్తి వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ..ప్రమాదవస్తూ చెట్టుపై నుంచి కిందపడి మరణించిన కార్మికులకు ఇస్తున్న ఎక్సగ్రేషయో ఏమాత్రం సరిపోవడం లేదని అన్నారు …శాశ్విత వికలాంగులకు 10 లక్షలు , గాయపడిన వారికీ లక్ష రూపాలయాల చొప్పున ఇచ్చి వారిని ఆదుకోవాలని అన్నారు …
రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారని వారు తెలిపారు . తాళ్లు ఎక్కే క్రమంలో ప్రమాదం జరిగి వందలాదిమంది కాళ్లు చేతులు విరగడం, నడుము పడిపోవడం, చనిపోవడం జరుగుతుందన్నారు . సంవత్సరానికి సుమారు 550 మంది చెట్టుపై నుంచి జారి పడుతున్నారు వీరిలో 180 మంది చనిపోతున్నారు. అంటే సరాసరి రెండు రోజులకు ఒకరు చనిపోతున్నారు . ఇంత ప్రమాదం ఏ వృత్తిలో లేదు. అయినా బతుకుతేరువు కోసo వృత్తి ప్రమాదమైనప్పటికి చేస్తున్నారని అన్నారు . ప్రమాదాలను నివారించడానికి కాటమయ్య రక్ష సేఫ్టీ కిట్టులను కల్లుగీత వృత్తి చేసే వారందరికీ పంపిణీ చేయాలని కోరారు … రీయల్ ఎస్టేట్ వ్యాపారం పెరగి భూములకు విపరీతంగా ధరలు పెరగడంతో తాటి ఈత చెట్లను నరికి వేస్తున్నారని ఇది దానిపై ఆధారపడి జీవించే వారి జీవన భృతిని దెబ్బతీసిందని పేర్కొన్నారు . రోజు రోజుకు వనాలు తరిగిపోతున్నాయి. లిక్కర్, బెల్టు ఫాపుల శీతల పానీయాల వలన ప్రజల ఆరోగ్యానికి హానికరమైనప్పటికీ ప్రభుత్వాలు నియంత్రించడం లేదన్నారు … వాటి వలన కల్లు అమ్మకాలు పడిపోతున్నాయని అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు .. ప్రకృతి పానీయమైన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే కల్లుకు మార్కెట్ లేకపోవడం దారుణమన్నారు ..
ఎజెన్సీ ఏరియాలో సొసైటీలు రద్దు కావడంతో అక్కడి గీత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు .1991 లో కాంగ్రేస్ ప్రభుత్వ హయాంలో కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం కల్లుగీత పారిశ్రామిక సహకార ఆర్దిక సంస్త ఏర్పాటు చేసింది . గీత కార్మిలకు రుణాలు ఇవ్వడం, నీరా తాటి ఈత ఉత్పత్తుల శిక్షణా కేంద్రం ఏర్పాటు, నందనం లో 5 ఎకరాల భూమి కొనుగోలు తదితర కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వాలు మారడం వలన తగిన శ్రద్ద చూపక పోవడంతో ఈ కార్పొరేషన్ క్రమంగా నిర్విర్యం అయ్యిందని అన్నారు .. .2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా దీనికి తగిన బడ్జెట్ కేటాయింపులు జరగలేదని ఫలితంగా ఎలాంటి పథకాలు అమలు కాలేదని వారు వాపోయారు . దీని లక్ష్యం గీత కార్మికులను ఆర్థికంగా అభివృద్ధి చేయడం, మారుతున్న కాలానికి అనుగునంగా వృత్తిలో అధునీకరణ తీసుకరావడం కాని అది నేటికి నెరవేరలేదన్నారు . గత ప్రభుత్వం నక్లెస్ రోడ్ లో నీరా కేఫ్ ఏర్పాటు చేసింది. దీనిని టూరిజం శాఖ నిర్వహిస్తుంది.టాడి కార్పొరేషన్ ద్వారా నిర్వహించి జిల్లాలకు విస్తరింప చేయాలనీ వారు వారు డిమాండ్ చేశారు ..
బెల్టు షాపులను పూర్తిగా నిషేదించాలన్నారు . కల్లులోని పోషకాలను, ఔషద గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేసి మార్కెట్ సౌకర్యం కల్పించాలని కోరారు . గీత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ఎలాంటి షరతులు లేకుండా 50 సంవత్సరాలు నిండిన ప్రతి గీత కార్మికునికి చేయూత పథకం ద్వారా 5వేలు ఇవ్వాలన్నారు
కల్లుగీత కార్మికులందరికి వృత్తికి ఉపయోగ పడే ద్విచక్ర వాహనాలు ఇవ్వాలి ఎజెన్సి ఏరియాలో కల్లుగీత సొసైటీలను పునరుద్ధరించి సంక్షేమ పధకాలు అక్కడి గీత కార్మికులకు వర్తింప చేయాలి. రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి 5 వేల కోట్లు కేటాయించి టాడి కార్పొరేషన్ ను సమర్థవంతంగా నిర్వహించాలి. ప్రతి సొసైటీకి చెట్ల పెంచడానికి 5 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇవ్వాలని ఉన్న 560 జివో అమలు చేయాలి. లేదా కొనివ్వాలి. టిడిపి ప్రభుత్వం హయాంలో కోటి వరాల పథకంలోఇచ్చిన 439 సొసైటీల భూములకు పెన్సింగ్ చేయించాలి. తాటి, ఈత, జీనుగు, ఖర్జూర తదితర కల్లునిచ్చే పొట్టి చెట్లు నాటాలి.
కల్లుగీత కార్పోరేషన్ నుండి వృత్తిలో చనిపోయిన వారి కుటుంబాలకు ఇస్తున్న తక్షణ సహాయం పెంచాలి. దహన సంస్కారాల కొరకు 50,000లు, గాయాలైన వారికి వైద్య ఖర్చుల కొరకు 25,000లు ఇవ్వాలి.నీరా, తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ప్రతి జిల్లా కేంద్రంలో నెలకొల్పాలి. గౌడ యువతీ యువకులకు ఉపాది కల్పించాలి.తాటి ఈత చెట్లు నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విదంగా కొత్త చట్టం తీసుకరావాలి. వేతన గీత కార్మికులకు అసోషియేట్ మెంబర్షిప్ ఇవ్వాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. ప్రభుత్వ సంక్షేమ పధకాలు వర్తించ చేయాలి.ప్రతి గ్రామంలో కమ్యూనిటీ భవనం నిర్మించి ఇవ్వాలి.
సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన విదంగా జనగాం జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలి.వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ..ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోడపట్ల సుదర్శన్ గాలి అంజయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు కొండం కరుణాకర్ పాల్గొన్నారు