క్రైమ్ వార్తలు

శంషాబాద్ విమానాశ్రయంలో రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం!

  • బ్యాంకాక్ నుంచి వస్తున్న ఇద్దరి వద్ద హైడ్రోపోలిక్ వీడ్‌ను గుర్తించిన అధికారులు
  • 7.096 కిలోల డ్రగ్స్ స్వాధీనం
  • కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్న అధికారులు

హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు రూ.7 కోట్ల విలువ చేసే 7.096 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్‌ను హైడ్రోపోలిక్ వీడ్‌గా గుర్తించారు. ఈ డ్రగ్స్‌కు సంబంధించి బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.

వీరిద్దరి లగేజీని తనిఖీ చేసిన సమయంలో అనుమానం వచ్చిన అధికారులు… క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. 13 కెల్లాగ్స్ ప్యాకెట్లలో ఈ డ్రగ్స్‌ను గుర్తించారు. నిందితులపై 1985 ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

Related posts

నర్సరీ బాలికపై అత్యాచారం చేసిన స్కూలు బస్సు డ్రైవర్..

Drukpadam

చిట్టీని లవ్ లెటర్ అనుకున్న అమ్మాయి…బాలుడ్ని నరికి చంపిన అమ్మాయి సోదరులు!

Drukpadam

ఆర్థిక నేరగాడు సుఖేశ్ ను జైలులో కలిసిన 12 మంది బాలీవుడ్ భామలు, మోడల్స్…?

Drukpadam