Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

పితృస్వామ్యమే అడ్డుపడితే ఇందిరాగాంధీ ప్రధాని ఎలా కాగలిగారు?: నిర్మలా సీతారామన్

  • పితృస్వామ్యం అనేది వామపక్షాలు కనిపెట్టిన భావన అన్న కేంద్రమంత్రి
  • అద్భుతమైన పడికట్టు పదాలకు మోసపోవద్దని సూచన
  • పితృస్వామ్యం మీ కలలను సాధించకుండా నిలువరించలేదని వ్యాఖ్య

మన దేశంలో మహిళలు ఎదగకుండా పితృస్వామ్య వ్యవస్థ అడ్డుపడిందే నిజమైతే ఇందిరాగాంధీ ప్రధాని ఎలా కాగలిగారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. బెంగళూరులో సీఎంఎస్ బిజినెస్ స్కూల్ విద్యార్థులతో జరిగిన సమావేశంలో మహిళా సాధికారత, పితృస్వామ్యంపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఓ విద్యార్థి మహిళా సాధికారత గురించి ప్రశ్నించారు. దీనిపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ… పితృస్వామ్యం అనేది వామపక్షాలు కనిపెట్టిన భావన అన్నారు. అద్భుతమైన పడికట్టు పదాలకు మోసపోవద్దని… లాజికల్‌గా ఉండాలన్నారు. పితృస్వామ్యం మీ కలలను సాధించకుండా నిలువరించదన్నారు.

అదే సమయంలో మహిళలకు తగిన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత, అవశ్యకత ఉందని అంగీకరించారు. మోదీ ప్రభుత్వం ఆవిష్కరణలు చేసే వారికి ప్రోత్సాహాన్ని ఇస్తోందన్నారు.

Related posts

ఎగ్జిట్ పోల్స్ వ్యవస్థ సిగ్గుపడేలా హర్యానా ట్రెండ్స్ ఉన్నాయి: శశి థరూర్

Ram Narayana

పదవి తీసేసిన ఫర్వాలేదు …కేంద్రమంత్రి సురేష్ గోపి సంచలన వ్యాఖ్యలు!

Ram Narayana

కర్ణాటకలో ‘ఆపరేషన్ లోటస్’.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 50 కోట్ల ఆఫర్.. సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు…

Ram Narayana

Leave a Comment