- చంద్రబాబుకు సోదర వియోగం
- గుండెపోటుతో కన్నుమూసిన నారా రామ్మూర్తినాయుడు
- చంద్రబాబుకు ఫోన్ చేసి పరామర్శించిన రాహుల్ గాంధీ
ఏపీ సీఎం చంద్రబాబు తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడి మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇవాళ ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు… ఏఐజీ ఆసుపత్రి వద్ద బాధలో ఉన్న ఇతర కుటుంబ సభ్యులను చూడగానే మరింత వేదనకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో, సోదరుడి మృతితో తీవ్ర విచారానికి గురైన చంద్రబాబుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసి పరామర్శించారు. విషాదంలో ఉన్న చంద్రబాబు కుటుంబానికి రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.