- యూపీలో కొత్త జంటకు కరెన్సీ వర్షంతో స్వాగతం
- జేసీబీలపై నిల్చుని మరీ నోట్లు గాల్లోకి విసిరిన వైనం
- 100, 200, 500 నోట్లను కాగితాల లాగా చల్లిన మగపెళ్లివారు
పెళ్లి ఊరేగింపులో వధూవరులపై పూల వర్షం కురిపించడం గురించి విని ఉంటారు.. కానీ ఉత్తర ప్రదేశ్ లోని ఓ పెళ్లి బారాత్ లో కొత్త దంపతులపై నోట్ల వర్షం కురిసింది. మగ పెళ్లివారి తరఫున విచ్చేసిన అతిథులు కొందరు కరెన్సీ నోట్లను చిత్తు కాగితాల లాగా విసిరేశారు. జేసీబీల పైకెక్కి, బంగ్లా పై నుంచి రూ.100, 200, 500 నోట్లను గాల్లోకి విసిరారు. ఏకంగా రూ.20 లక్షలను ఇలా వర్షంలా కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లోని సిద్దార్థ నగర్ లో చోటుచేసుకుందీ ఘటన. వధూవరులపై ఇలా నోట్ల వర్షం కురిపించడంతో గ్రామస్థులు ఆ కరెన్సీని ఏరుకోవడానికి ఎగబడ్డారు. ఆ కొత్త దంపతుల పేర్లు అప్జల్, అర్మాన్ అని చెప్పడం వీడియోలో వినిపించింది.