Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ప్రజా ప్రయోజనం మీడియా బాధ్యత-కె. శ్రీనివాస్ రెడ్డి

ప్రజా ప్రయోజనం మీడియా బాధ్యత-కె. శ్రీనివాస్ రెడ్డి


సంచలనాల కోసం కాకుండా, ప్రజా ప్రయోజనాలకు దోహదపడే కథనాలతో మీడియా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
బుధవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని ఎస్.ఎం.ఆర్ ఫంక్షన్ హాలులో టీయుడబ్ల్యూజే చౌటుప్పల్ శాఖ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల పక్షపాతిగా వ్యవహరిస్తూ, మీడియా స్వేచ్ఛగా తన బాధ్యతల్ని నిర్వర్తించేందుకే ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడుతోందని ఆయన స్పష్టం చేశారు. అయితే సమాజ శ్రేయస్సు కోసం గతంలో మీడియా పోషించిన పాత్రకు, ప్రస్తుతం పోషిస్తున్న పాత్రకు ఎంతో తేడా ఉందన్నారు. వ్యాపార కోణంలో మీడియాను కొనసాగిస్తే ప్రజల ఆకాంక్షాలకు అనుగుణంగా సమాజానికి మేలు చేయలేరని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భావ వ్యక్తీకరణకు సోషల్ మీడియా పురుడు పోసుకోవడం శుభ పరిణామమే అయినప్పటికీ,
ఆ స్వేచ్ఛను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం సహించరానిదన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం మీడియా అకాడమీ తన వంతు కృషి చేస్తుందన్నారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఆరోగ్య పథకం, ఇంటి స్థలాలు, ఇండ్లు అందించే దిశలో కృషి చేస్తున్నట్లు శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ మాట్లాడుతూ, నాడు ఉమ్మడి రాష్ట్రంలో, నేడు తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల గొంతుకగా పనిచేస్తున్న ఏకైక సంఘం తమదేనన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో యాభై యేండ్ల నుండి క్రియాశీలక పాత్ర పోషిస్తూ, జాతీయ స్థాయిలో జర్నలిస్టుల గొంతుకగా నిలిచిన శ్రీనివాస్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ గా కొనసాగడం మీడియా రంగానికి శుభపరిణామమని ఆయన కొనియాడారు. రాష్ట్రంలో జర్నలిస్టుల ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి నిరంతరం తమ సంఘం కృషి చేస్తున్నట్లు విరాహత్ స్పష్టం చేశారు. ఇంకా ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎంబ నర్సింలు, కరుణాకర్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు మల్లేశం, జర్నలిస్టుల ఆరోగ్య కమిటీ సభ్యులు జహంగీర్, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఏ. ఇంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతుల రుణమాఫీ పై మార్గదర్శకాలు ….ఈ విధంగా ఉండే అవకాశం ఉంది…?

Ram Narayana

విద్యార్థుల ప్రేమను చూరగొన్న టీచర్ …

Ram Narayana

తెలంగాణ టెన్త్ ఫ‌లితాల విడుద‌ల‌.. సత్తాచాటిన బాలిక‌లు!

Ram Narayana

Leave a Comment