అంతర్జాతీయం

అమెరికాలో అదానీ లంచంకేసు ప్రకంపనలు ….

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2 వేల వందకోట్ల లంచం …అదికూడా అగ్రరాజ్యం అమెరికాలో తప్పుడు పాత్రలతో నిధులు సేకరించే క్రమంలో దొరికి పోవడం సిగ్గుచేటు …భారత్ లో ఆపర కుబేరుడిగా , ప్రపంచ కుబేరుల్లో ఒకడిగా దర్జాలు వెలగబెడుతున్న అదానీ లంచం కేసులో ఉరుక్కుపోవడం దేశానికే తలవంపులు …దేశ సంబంధాలపై దీని ప్రభావం ఏమి ఉండదని ఇరు దేశాలు ప్రకటిస్తున్న అది వంచనేని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి…

బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతం అదానీ చుట్టూ వివాదం అలముకున్న వేళ భారత్-అమెరికా మధ్య సంబంధాలపై అమెరికా స్పందించింది. తమ మధ్య సంబంధాల విషయంలో ఏమాత్రం రాజీపడకుండా ఇరు దేశాలు ఈ సమస్యను అధిగమిస్తాయని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

అదానీ గ్రూప్‌పై ఆరోపణల విషయం తమ దృష్టికి వచ్చిందని పియర్ చెప్పారు. వీటిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ (డీవోజీ) మాత్రమే సరైన సమాచారం ఇవ్వగలవని పేర్కొన్నారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఎప్పట్లానే బలంగా ఉన్నాయని వివరించారు. ‘‘నేనేం చెప్పాలనుకుంటున్నానంటే భారత్, యూఎస్ మధ్య సంబంధాలు బలమైన పునాదులపై నిలబడి ఉన్నాయి. ఇరు దేశాలు ఈ సంక్షోభాన్ని అధిగమిస్తాయి’’ అని తెలిపారు.

గౌతం అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై అమెరికాలో లంచం కేసు నమోదైంది. సోలార్ పవర్ ఒప్పందాలకు సంబంధించి భారత్‌లో దాదాపు రూ. 2,100 కోట్లు (265 మిలియన్ డాలర్లు) లంచంగా ఇచ్చారని, ఆ సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి అమెరికాలో నిధులు సేకరించారన్న అభియోగాలు నమోదయ్యాయి. అదానీ సహా 8 మందిపై కేసు నమోదైంది.

Related posts

నిజ్జర్ హత్య కేసులో కీలక పరిణామం.. నిజాన్ని అంగీకరించిన కెనడా ప్రధాని ట్రూడో

Ram Narayana

దుండ‌గుడి కాల్పుల్లో స్లొవేకియా ప్ర‌ధానికి తీవ్ర గాయాలు.. ప‌రిస్థితి విష‌మం!

Ram Narayana

బియ్యానికి భారీ డిమాండ్.. అమెరికా వ్యాపారులపై కనకవర్షం

Ram Narayana