Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

భారత జనాభా చైనా కంటే డబుల్… అదెలాగో తెలుసా?

  • జనాభా విషయంలో చాలా ఏళ్లుగా పోటీపడుతున్న భారత్‌, చైనా
  • కొన్నేళ్లుగా చైనాలో తగ్గిపోతున్న జననాల రేటు
  • ఇప్పటికీ ఇరు దేశాల మధ్య జనాభా సంఖ్యలో స్వల్ప తేడానే…
  • భవిష్యత్తులో చైనా జనాభా భారీగా తగ్గిపోతుందని అంచనా

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత జనాభా ఉన్న దేశం ఏదంటే చైనా అని అందరూ టక్కున చెబుతారు. కానీ అనధికారికంగా భారత్‌ జనాభాలో చైనాను దాటేసింది. కానీ రెండు దేశాల మధ్య తేడా స్వల్పమే. కానీ భవిష్యత్తులో భారత జనాభా సంఖ్యతో పోలిస్తే చైనా జనాభా సంఖ్య సగమే ఉంటుందట. ఏదో ఉత్తుత్తి లెక్క కూడా కాదు. ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) జనాభా విభాగం వేసిన అధికారిక అంచనాలే ఇవి.

2100 సంవత్సరం నాటికి…
దాని ప్రకారం 2100 సంవత్సరం నాటికి భారత జనాభా 153 కోట్లకు చేరుకుంటే… చైనా జనాభా 77 కోట్లకు తగ్గిపోతుందట. చైనాలో చాలా ఏళ్లుగా ‘ఒకరు లేదా అసలే వద్దు’ అనే నినాదంతో పిల్లలను కనడం తగ్గించేశారు. దానికితోడు పెరిగిపోతున్న ఖర్చులతోనూ ఎక్కువ మంది పిల్లలను కనడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దానితో కొన్నేళ్లుగా చైనా జనాభా తగ్గిపోతూ వస్తోంది. మన దేశంలో పరిస్థితి మధ్యస్థంగా ఉంది. అందువల్ల జనాభా పెరుగుదల స్థిరంగా కొనసాగుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.

2100 సంవత్సరం నాటికి ప్రపంచ దేశాల జనాభా అంచనాలు 
దేశం జనాభా సంఖ్య 
భారత్153.3 కోట్లు
చైనా77.1 కోట్లు
నైజీరియా54.6 కోట్లు
పాకిస్తాన్48.7 కోట్లు
కాంగో43.1 కోట్లు
యూఎస్ఏ39.4 కోట్లు
ఇథియోపియా32.3 కోట్లు
ఇండోనేషియా29.7 కోట్లు
టాంజానియా24.4 కోట్లు
ఈజిప్ట్20.5 కోట్లు
బ్రెజిల్18.5 కోట్లు
ఫిలిప్పీన్స్18.0 కోట్లు
బంగ్లాదేశ్17.7 కోట్లు
నైగర్16.6 కోట్లు
సూడాన్14.2 కోట్లు
అంగోలా13.3 కోట్లు
ఉగాండా13.2 కోట్లు
మెక్సికో11.6 కోట్లు
కెన్యా11.3 కోట్లు
రష్యా11.2 కోట్లు
ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్11 కోట్లు
మొజాంబిక్10.6 కోట్లు
వియత్నాం9.1 కోట్లు
కామెరూన్, మాలి8.7 కోట్లు
మడగాస్కర్, టర్కీ8.3 కోట్లు
ఇరాన్7.9 కోట్లు
దక్షిణాఫ్రికా7.4 కోట్లు
యెమెన్, జపాన్, యూకే, జర్మనీసుమారు 7 కోట్లు
కెనడా, సౌదీ అరేబియా, అర్జెంటీనాసుమారు 5 కోట్లు
ఆస్ట్రేలియా, ఇటలీ3.5 కోట్లు
స్పెయిన్, దక్షిణ కొరియా3.0 కోట్లు

Related posts

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై హత్యాయత్నం ….

Ram Narayana

ఖలిస్థాన్ నిజ్జర్ హత్య: కెనడాకు కీలక సమాచారం ఇచ్చింది అమెరికాయేనా?

Ram Narayana

టీసీఎస్ కంపెనీపై అమెరికన్ ఉద్యోగుల తీవ్ర ఆరోపణలు

Ram Narayana

Leave a Comment