ఆంధ్రప్రదేశ్

రేవంత్ రెడ్డి.. ఇది నీ నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్దం హరీష్ రావు ఫైర్

అక్రమ నిర్బంధాలు, అరెస్టుల పట్ల మాజీ మంత్రి హరీష్‌రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి పోస్టు చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్ళనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు.

”ఇది నీ నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్దం. ఒకవైపు ప్రజా పాలన విజయోత్సవాలు అని ప్రచారం చేసుకుంటూ, మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటించావు. మీ అప్రజాస్వామిక విధానాలు, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వైఖరిని చూసి హైదరాబాద్ నడిగడ్డపై ఉన్న అంబేద్కర్ సైతం నివ్వెరపోతున్నాడు. అదుపులోకి తీసుకున్న మా పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం” అంటూ హరీష్‌ రావు ఎక్స్‌లో పోస్టు చేశారు.

Related posts

‘నలుపు’ వజ్రం.. వేలానికి రెడీ!

Drukpadam

అమెరికాకు వెళ్లిపోయిన వైఎస్ విజయమ్మ?

Ram Narayana

వీధి కుక్కలను పట్టుకునేందుకు నేపాల్ నుంచి ప్రత్యేక బృందాలు!

Drukpadam