తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీని సరిగా నడపలేక పోతున్నారంటూ ప్రభుత్వంపై అక్బరుద్దీన్ దాడి…వాక్ అవుట్

వీళ్లు అసెంబ్లీనే సరిగ్గా నడపకలేపోతే.. ఇక ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారంటూ అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. కోపంతో తన చేతిలో ఉన్న పేపర్ను విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ఈ సమయంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఏ అంశంపై చర్చ చేపడుతున్నారని సమాచారం ఇవ్వాలన్నారు. సభను నడిపే విధానం ఇది కాదంటూ ధ్వజమెత్తారు. ”పార్లమెంటులో కూడ చర్చించాల్సిన అంశాల గురించి ముందుగానే చెబుతారు. ఇక్కడ సభను ఎన్నిరోజులు నడుపుతారో తెలియదు. మీరు అంశంపై మాట్లాడుతున్నారో కూడా తెలియదని” అక్బరుద్దిన్ మండిపడ్డారు. వీళ్లు అసెంబ్లీనే సరిగ్గా నడపలేకపోతే.. ఇక ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Related posts

శ్వేతపత్రంపై తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల ఢీ…!

Ram Narayana

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా…!

Ram Narayana

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16 వరకు వాయిదా…!

Ram Narayana