తెలంగాణ రాజకీయ వార్తలు ..తెలంగాణ వార్తలుతెలంగాణ హైకోర్టు వార్తలు

పాడి కౌశిక్ రెడ్డికి మాసాబ్ ట్యాంక్ పోలీసుల నోటీసులు!

  • రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు
  • రేపు కరీంనగర్ కోర్టుకు హాజరు కావాల్సి ఉందని పోలీసులకు సమాధానం
  • 17న విచారణకు హాజరవుతానన్న పాడి కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి మాసాబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

అయితే, తాను రేపు కరీంనగర్‌లో కోర్టుకు హాజరు కావాల్సి ఉందని, ఎల్లుండి అంటే ఈ నెల 17న విచారణకు హాజరవుతానని పోలీసులకు సమాధానం ఇచ్చారు.

బంజారాహిల్స్ ఇన్స్‌పెక్టర్ విధులు అడ్డుకోవడం, బెదిరింపుల వ్యవహారంలో ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మాసాబ్ ట్యాంక్ ఇన్‌స్పెక్టర్ పరుశురాంను దర్యాఫ్తు అధికారిగా నియమించారు.

Related posts

రేవంత్ రెడ్డిని మంత్రులే దించేయాలని చూస్తున్నారు…బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Ram Narayana

జనాభా ప్రకారమే బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి…బీఆర్ యస్ ఎమ్మెల్సీ కవిత

Ram Narayana

కాంగ్రెస్ అభ్యర్థుల నాల్గొవ జాబితా …సూర్యాపేట లో పటేల్ రమేష్ రెడ్డికి మళ్ళీ నిరాశ…

Ram Narayana