జాతీయ వార్తలుసైన్సు అండ్ టెక్నాలజీ

ఇస్రో మరో ఘనత.. స్పేస్ డాకింగ్ సక్సెస్!

  • గత నెల 30న ఇస్రో స్పాడెక్స్ ప్రయోగం
  • చేజర్, టార్గెట్ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు
  • మూడుసార్లు డాకింగ్ ప్రయత్నాలు
  • తాజాగా డాకింగ్ విజయవంతం
  • ఈ సాంకేతికత కలిగిన నాలుగో దేశంగా భారత్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్షంలో చరిత్ర సృష్టించింది. ఇటీవల పంపిన ఉపగ్రహాలను డాకింగ్ (అనుసంధానం) చేసి ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా అవతరించింది. ఇస్రో గత నెల 30న పీఎస్ఎల్వీ ద్వారా రెండు చిన్న ఉపగ్రహాలు ఎస్‌డీఎక్స్01 (చేజర్), ఎస్‌డీఎక్స్02 (టార్గెట్)లను కక్ష్యలోకి పంపింది. అంతరిక్షంలో మనకంటూ స్పేస్ స్టేషన్ నిర్మించడమే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టింది. అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో డాకింగ్ ఎంతో కీలకం. 

నింగిలోకి పంపిన ఉపగ్రహాలను డాకింగ్ చేసేందుకు ఇస్రో మూడుసార్లు ప్రయత్నించినప్పటికీ వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నెల 12 ఈ రెండు ఉపగ్రహాలను మూడు మీటర్ల దూరానికి తీసుకొచ్చినప్పటికీ అనుసంధానం వాయిదా పడింది. తాజాగా, ఉపగ్రహాల డాకింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్టు ఇస్రో ప్రకటించింది. 

ఈ విజయంతో డాకింగ్ టెక్నాలజీ కలిగిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది.  ప్రస్తుతం ఈ సాంకేతికత అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉంది. చంద్రుడిపై నమూనాలను సేకరించి భూమిపైకి తీసుకురావడం, అంతరిక్షంలో భారత్ సొంత స్సేస్ స్టేషన్ ఏర్పాటు, 2040 నాటికి చంద్రుడిపైకి మనుషుల్ని పంపడం వంటి లక్ష్యంతో ఈ ప్రయోగం చేపట్టారు.

Related posts

బెంగాల్‌లో బంగ్లాదేశ్ తరహా ఆందోళనలు…మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు

Ram Narayana

ఒకే వేదికపై మోదీ, శరద్ పవార్.. ఇవి ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలన్న ప్రధాని

Ram Narayana

కశ్మీర్‌లో చైనా జాతీయుడి అరెస్ట్.. గూఢచర్యం కోణంలో దర్యాప్తు…

Ram Narayana