జాతీయ వార్తలు

నెత్తురోడుతున్న ఛత్తీస్ ఘడ్ …సక్సెస్ ఫుల్ గా మావోల ఏరివేత!

వరుస ఎన్కౌంటర్లలో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో నక్సల్స్ ఏరివేత చివరి దశకు వచ్చినట్లు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రకటించారు …ఆయన అన్నట్లుగానే ఒకప్పుడు తమ అధీనంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో పోలీసులు పాగా వేశారు …ఫికెట్లు వేర్పాటు చేశారు …ఛత్తీస్ ఘడ్ , మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని అటవీ ప్రాంతాలు, తెలంగాణ , ఆంధ్ర ,ఒడిశా సరిహద్దులను పోలీసులు జల్లెడపడుతున్నారు …ఇటీవల కాలంలోనే జరిగిన ఎన్కౌంటర్లలో మావోలు కీలక నేతలను పోగుట్టుకున్నారు …నేడు ఒడిశా , ఛత్తీస్ ఘడ్ రిజర్వ్ ఫారెస్ట్ ఘాట్ రోడ్ భారీ ఎన్కౌంటర్ తో రక్తసిక్తంగా మారింది … ఈ భీకర పోరులో 20 మందికి పైగా నక్సల్స్ మరణించారని ఛత్తీస్ ఘడ్ పోలీసులు ప్రకటించారు …

ఉమ్మడి మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి పూర్తీ అటవీ ప్రాంతంతో కప్పబడిన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం పచ్చని చెట్లు ,పక్షుల కిలకిల రాగాలు కనుమరుగై నేడు నెత్తురోడుతున్నది … గల గల పారాల్సిన వాగులు వంకలు ,రక్తపు ఏరులై పారుతున్నాయి…నక్సల్స్ మందుపాతరలు , పోలిసుల గన్ ఫైరింగ్ శబ్దాలతో అడువులన్ని దద్దరిల్లు తున్నాయి..గ్రామాల్లో ఒకపక్క నక్సల్స్ , మరోపక్క పోలిసుల బూట్ల చప్పుళ్లమధ్య అడవి బిడ్డలు సంవత్సరాల తరబడి గ్రామాలను ఖాళీ చేసి తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లలో కూలి నాలి చేస్తూ జీవనం గడుపుతున్నారు …ఉన్న కొద్దిమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకులు ఈడుస్తున్నారు …

మావోయిస్టు లను తుద ముట్టించాలనే సంకల్పంతో ఉన్న కేంద్ర సర్కార్ నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలను సమన్వయం చేస్తూ వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది … కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మావోల విషయంలో రాష్ట్రాల మధ్య సమన్వయ సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు …ప్రధానంగా ఛత్తీస్ ఘడ్ , మహారాష్ట్ర , ఝార్ఖండ్ , తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో నక్సల్స్ సమస్య ఉంది …ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు లెఫ్ట్ వింగ్ తీవ్రవాదం కింద ప్రత్యేక ఫండ్స్ కేంద్ర అందజేసింది …దీంతో ఇటీవల కాలంలో నక్సలైట్ల ఏరివేత ముమ్మరమైంది …గత సంవత్సర కాలంలో పదుల సంఖ్యలోనే నక్సల్స్ చనిపోయారు …కొత్త రిక్రూట్మెంట్స్ లేవు …

సోమవారం రాత్రి ఛత్తీస్ ఘడ్ , ఒడిశా సరిహద్దుల్లోని రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 20 మంది నక్సల్స్ మృతి చెందగా మరికొంతమంది గాయాలతో పారిపోయారు …మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం .. చనిపోయిన నేతల్లో మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యులు జయరాం అలియాస్ చలపతి ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు .మరో కీలక నేత కూడా ఉన్నారని తెలుస్తుంది ..కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ ఎన్కౌంటర్ పై స్పందించారు …మావోల వెరివేత చివరి దశకు చేరుకుందని అన్నారు …వరస ఎన్కౌంటర్లలో మావోల ప్రభావం బాగా తగ్గిందని కేంద్రం భావిస్తుంది …బలిమెల , చింతల్నార్ , జగదల్పూర్ రహదారి , బస్తర్, బీజాపూర్ , నారాయణ పూర్ , ప్రాంతాల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లు మావోలకు ,పోలీసులకు మధ్య వార్ లాగానే నడిచింది ..మావోలకు మంచి షల్టర్ గా ఉన్న అబుజామాద్ ప్రాంతాల్లో సైతం పోలీసులు, కోబ్రా , భద్రతా దళాలు డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతూ నక్సల్స్ ను మట్టుబెడుతున్నాయి …ఒకప్పుడు తమ సొంతరాజ్యం నడిపించిన మావోలు అక్కడ నుంచి తమ స్థావరాలను సైతం ఖాళీ చేసినట్లు తెలుస్తుంది ..

నేడు జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్ట్ కీలక నేత చలపతి తలపై రూ.కోటి రివార్డు ఉంది …కులరైఘాట్ రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభ్యం అయినట్లు పోలీసులు తెలిపారు …
మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ కీలక కేంద్ర కమిటీ సభ్యుడు జయరాం అలియాస్ చలపతి ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయాడని పోలీస్ ఉన్నతాధికారులు సైతం ప్రకటించారు. చలపతిపై ప్రభుత్వం గతంలోనే రూ.కోటి రివార్డు ప్రకటించిందని తెలిపారు. ఒడిశా బార్డర్ లోని గరియాబండ్ జిల్లా కులరైఘాట్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో మావోయిస్టుల కదలికలకు సంబంధించి విశ్వసనీయ సమాచారం అందడంతో భద్రతాబలగాలు సోమవారం గాలింపు చర్యలు చేపట్టాయని ఛత్తీస్ ఘడ్ పోలీస్ అధికారులు తెలిపారు .ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడడం, కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. పోలీసుల కాల్పుల్లో మొత్తం 20 మంది మావోయిస్టులు చనిపోయారు. చెట్లు, పొదల పక్కన పడి ఉన్న మృతదేహాలను పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. అదే ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు …

Related posts

రాహుల్ గాంధీ శిక్షను సమర్థించిన గుజరాత్ హైకోర్టు జడ్జి బదిలీ

Ram Narayana

త్రిపురలో హెచ్ఐవీ క‌ల‌క‌లం.. 47 మంది విద్యార్థుల మృతి!

Ram Narayana

ఆల్ ఫలా వర్సిటీ క్యాంపస్ ఆస్తుల జప్తు!

Ram Narayana