జాతీయ వార్తలు

మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు…!

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ,ఎస్సీ వర్గీకరణ పోరాట సారధి మంద కృష్ణమాదిగకు కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది ….గత 30 సంవత్సరాలుగా ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం విరామమెరుగని ఉద్యమాలు చేస్తున్నారు …చిన్నపిల్లలకు గుండెజబ్బుల ఆపరేషన్స్ నుంచి ఆరోగ్యశ్రీ అమలు దాక మంద కృష్ణ చేసిన ఉద్యమాలు ఫలితాలనిచ్చాయి… తమ జాతికి ఉపాధి ఉద్యోగాల్లో సరైన న్యాయం జరగడంలేదని ఎత్తిన నినాదం దించకుండా తన మేడలో నల్లని తువాలు వేసుకొని చేస్తున్న పోరాటాల ఫలితంగా వర్గీకరణపై సుప్రీం కోర్ట్ అనుకూలంగా తీర్పు నిచ్చింది …అయితే దాని అమలు భాద్యతలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది దాని అమలు కోసం ఆయన ఫిబ్రవరి 7 లక్ష దప్పులతో భారీ ప్రదర్శన తలపెట్టిన నేపథ్యంలో ఆయనకు పద్మశ్రీ రావడం సంతోషించదగ్గ విషయమే అయినా వర్గీకరణ జరగకుండా ఆయన పద్మశ్రీ అంగీకరిస్తారా లేదా అనేది సందేహమే తనకు అవార్డుల కన్నా ఎస్సీ వర్గీకరణ ముఖ్యమని అదే తనకు ఇచ్చే పెద్ద అవార్డు అని చెప్పే అవకాశాలు ఉన్నాయి…

నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్, మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ

Padmabhushan for Nandamuri Balakrishna
  • కళల రంగంలో బాలకృష్ణను వరించిన పద్మభూషణ్ 
  • ప్రజావ్యవహారాల్లో మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ

తెలుగు సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు ప్రకటించింది. కళల రంగంలో బాలకృష్ణకు (ఏపీ) పద్మభూషణ్ అవార్డు వచ్చింది. తెలంగాణ నుంచి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను (ప్రజావ్యవహారాలు) పద్మశ్రీ వరించింది.

మిరియాల అప్పారావు (కళలు-ఏపీ), కేఎల్ కృష్ణ (సాహిత్యం-ఏపీ), మాడుగుల నాగఫణిశర్మ (కళలు-ఏపీ), పంచముఖి రాఘవాచార్య (సాహిత్యం-ఏపీ) పద్మశ్రీ అవార్డు వచ్చాయి. 

కన్నడ నటుడు అనంతనాగ్‌కు (కళలు), తమిళ నటుడు అజిత్ కుమార్ (కళలు), తమిళ సీనియర్ నటి శోభనకు(కళలు), మహారాష్ట్రకు చెందిన శేఖర్ కపూర్ (కళలు), కేరళ హాకీ క్రీడాకారుడు శ్రీజేష్, ఢిల్లీకి చెందిన బబేక్ దేబ్రయ్ (సాహిత్యం), మహారాష్ట్రకు చెందిన మనోహర్ జోషి (ప్రజావ్యవహారాలు), బీహార్ నుంచి సుశీల్ కుమార్ మోదీ (ప్రజావ్యవహారాలు) పద్మభూషణ్ వచ్చాయి.

కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు వచ్చాయి.

139 మందికి పద్మ అవార్డులు… 113 మందికి పద్మశ్రీ

Centre announces first list of Padma Shri awardees
  • బ్రెజిల్ వేదాంతగురు జోనస్ మాశెట్టికి పద్మశ్రీ
  • పారాలింపియన్ గోల్డ్ మెడల్ విన్నర్ హర్వీందర్‌ను వరించిన పద్మ
  • నేపాల్ జానపద గాయకుడు బేరు సింగ్ చౌహాన్‌కు పద్మశ్రీ

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ వచ్చాయి.

  • జోనస్ మాశెట్టి (వేదాంత గురు) – బ్రెజిల్
  • హర్వీందర్ సింగ్ (పారాలింపియన్ గోల్డ్ మెడల్ విన్నర్) – హర్యానా
  • భీమ్ సింగ్ భవేష్ (సామాజిక సేవ) –  బీహార్
  • పి. దక్షిణామూర్తి (డోలు విద్వాంసుడు) – పుదుచ్చేరి
  • ఎల్. హంగ్ థింగ్  (వ్యవసాయం-పండ్లు) – నాగాలాండ్
  • బేరు సింగ్ చౌహాన్ (జానపద గాయకుడు) – మధ్యప్రదేశ్
  • షేఖా ఏజే అల్ సబాహ్ (యోగా) – కువైట్
  • నరేన్ గురుంగ్ (జానపద గాయకుడు) – నేపాల్
  • హరిమన్ శర్మ (యాపిల్ సాగుదారు) – హిమాచల్ ప్రదేశ్
  • జుమ్దే యోమ్‌గామ్ గామ్లిన్ (సామాజిక కార్యకర్త) – అరుణాచల్ ప్రదేశ్
  • విలాస్ దాంగ్రే (హోమియోపతి డాక్టర్) – మహారాష్ట్ర
  • వెంకప్ప అంబానీ సుగటేకర్ (జానపద గాయకుడు) – కర్ణాటక
  • నిర్మలాదేవి (చేతివృత్తులు) – బీహార్
  • జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు) – అసోం
  • సురేశ్ సోనీ (సామాజిక కార్యకర్త – పేదల వైద్యుడు) – గుజరాత్
  • రాధా బహిన్ భట్ (సామాజిక కార్యకర్త) – ఉత్తరాఖండ్
  • పాండి రామ్ మాండవి (కళాకారుడు) – ఛత్తీస్‌గఢ్
  • లిబియా లోబో సర్దేశాయ్ (స్వాతంత్ర సమరయోధురాలు) – గోవా
  • గోకుల్ చంద్రదాస్ (కళలు) – పశ్చిమ బెంగాల్
  • సాల్లీ హోల్కర్ (చేనేత) – మధ్యప్రదేశ్
  • మారుతీ భుజరంగ్ రావు  (సాంస్కృతికం, విద్య) – మహారాష్ట్ర
  • బతూల్ బేగమ్ (జానపద కళాకారిణి) – రాజస్థాన్
  • వేలు ఆసన్ (డప్పు వాద్యకళాకారుడు) – తమిళనాడు
  • భీమవ్వ దొడ్డబాలప్ప శిల్యేక్యాతర (తోలుబొమ్మలాట) – కర్ణాటక
  • పర్మార్ లవ్జీభాయ్ నాగ్జీబాయ్ (చేనేత) – గుజరాత్
  • విజయలక్ష్మి దేశ్ మానే (వైద్యం) – కర్ణాటక
  • చైత్రం దేవ్ చంద్ పవార్ (పర్యావరణ పరిరక్షణ) – మహారాష్ట్ర
  • జగదీశ్ జోషిలా (సాహిత్యం) – మధ్యప్రదేశ్
  • నీర్జా భట్లా (గైనకాలజిస్ట్) – ఢిల్లీ
  • హ్యూ, కొల్లీన్ గాంట్జర్ (సాహిత్యం, విద్య-ట్రావెల్) – ఉత్తరాఖండ్

Related posts

యూజర్ల ప్రైవసీకి ప్రమాదం.. ఫోన్ లొకేషన్‌పై కేంద్రం కొత్త రూల్!

Ram Narayana

గుజరాత్ లోని ఓ గేమింగ్ జోన్ లో ఘోర అగ్నిప్రమాదం… 35 మంది మృతి..

Ram Narayana

కుమ్రం భీమ్ ఆశయాలను కొనసాగిద్దాం: ప్రధాని మోదీ

Ram Narayana