టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు
- ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామ్ నారాయణ
టి యు డబ్ల్యూ జే (ఐజేయు) జర్నలిస్టు యూనియన్ ఖమ్మం ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం ప్రెస్ క్లబ్ వద్ద ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, యూనియన్ నగర కమిటీ అధ్యక్షుడు మైస పాపారావు కొబ్బరికాయలు కొట్టి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలలో ముఖ్యఅతిథిగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామ్ నారాయణ పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామ్ నారాయణ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోవడం విచారకరం అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఖమ్మంలో రెండు దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ వేడుకలలో యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు మాటేటి వేణుగోపాల్, రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావు, సామినేని మురారి, యూనియన్ జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి కనకం సైదులు, ఖమ్మం నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి నాగండ్ల శివ, మహేందర్, భూపాల్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ప్రెస్ క్లబ్ కోశాధికారి నామ పురుషోత్తం, జిల్లా నాయకులు తాళ్లూరి మురళీకృష్ణ, మొయినుద్దీన్, జనార్ధన చారి, ఏలూరు వేణుగోపాల్ రావు, పసుపులేటి సత్యనారాయణ, మేడి రమేష్, కళ్యాణ్, సబ్ ఎడిటర్ కొమ్మినేని ప్రసాదరావు, అప్పారావు, సురేష్, నాగేశ్వరరావు, మధులత తదితరులు పాల్గొన్నారు.
