Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

నానమ్మ కళ్లలో ఆనందం కోసం హత్య..

నానమ్మ కళ్లలో ఆనందం కోసం హత్య..

కారులో మృతదేహంతో రాత్రంతా షికారు..

సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం వెలుగుచూసిన పరువు హత్య కేసులో ఆరుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు భార్గవి ఇద్దరు సోదరులు (నవీన్, వంశీ), నానమ్మ (బుచ్చమ్మ), నాన్న (సైదులు)తో పాటు నవీన్ స్నేహితులు (మహేశ్, సాయి చరణ్‌)ను అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్ తెలిపారు. నిందితుల నుంచి కారు, 5 సెల్‌ఫోన్లు, కత్తి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సూర్యాపేటలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ, కోట్ల భార్గవి అనే యువతి ఆరు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో వారికి ఇష్టం లేకుండా తమ సోదరి కులాంతర వివాహం చేసుకోవడంతో రెండు నెలలుగా కృష్ణను అంతం చేసేందుకు భార్గవి సోదరులు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం కృష్ణను ఆదివారం హత్య చేయగా సోమవారం ఉదయం పిల్లలమర్రి కాల్వకట్టపై మృతదేహం లభ్యమైంది. కృష్ణను చంపేందుకు గతంలోనే 3 సార్లు ప్రయత్నించారని దర్యాప్తులో తేలింది. జిల్లా ఎస్పీ సన్​ప్రీత్ సింగ్ ఈ వివరాలు మీడియాకు వెల్లడించారు. వడ్లకొండ కృష్ణను హత్య చేసేందుకు అతని భార్య భార్గవికి చెందిన కుటుంబ సభ్యులు నలుగురితో పాటు మరో ఇద్దరు పాల్గొన్నారు. సూర్యాపేటలోని జనగామ క్రాస్‌ రోడ్డు సమీపంలోని నిందితుల్లో ఒకరైన బైరు మహేశ్‌ వ్యవసాయ భూమి వద్ద ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో హత్య చేశారు.

నానమ్మ బుచ్చమ్మ హస్తం.. ఈ హత్యలో ప్రధాన నిందితుని నానమ్మ బుచ్చమ్మ హస్తం ఉన్నట్లు గుర్తించి పోలీసులు అవాక్కయ్యారు. మనువరాలు భార్గవి ప్రేమ పెళ్లి ఆమెకు ఇష్టం లేదు. దీంతో కొద్ది నెలలుగా తన కుమారుడు, మనవళ్లను రెచ్చగొడుతూ హత్యకు పరోక్షంగా కారణమైయ్యారు.
హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కారులో వేసుకొని ఆత్మకూర్‌(ఎస్‌) మండలం పాత సూర్యాపేటలో బంధువుల ఇంటి వద్ద ఉన్న బుచ్చమ్మకు చూపించి సంతృప్తి పరిచారు..!! అనంతరం కారు డిక్కీలో మృతదేహం తీసుకుని నల్గొండ వరకు వెళ్లారు. దాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించగా ఏ ఆలోచన తట్టకపోయేసరికి చివరకు మృతదేహాన్ని పిల్లలమర్రి కాల్వకట్టపై పడేశారు.

Related posts

చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో లోకేశ్, అచ్చెన్నాయుడు పేర్లు చేర్చిన సీఐడీ

Ram Narayana

న్యూజెర్సీలో దారుణం..భారత సంతతి వ్యాపారవేత్తను కాల్చి చంపిన దుండగుడు!

Drukpadam

డ్రగ్స్ కేసు.. సినీ ప్రముఖుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Ram Narayana

Leave a Comment