తెలంగాణ వార్తలు

లక్షడప్పులు ,వేల గొంతుకలు ప్రదర్శన వాయిదా… మంద కృష్ణమాదిగ

ఎస్సీల వర్గీకరణ కోసం హైద్రాబాద్ మహానగరంలో తలపెట్టిన లక్ష డప్పులు,వేల గొంతుకల ప్రదర్శనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణమాదిగ తెలిపారు …నిన్న శాసనసభలో ప్రవేశ పెట్టిన ఎస్సీ వర్గీకరణలో కేటగిరీల విషయంలో ,న్యాయంగా తమకు రావాల్సిన వాటా విషయంలో అన్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు …జరిగిన లోపాలను సరిదిద్దాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు …బుధవారం హైద్రాబాద్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సుదీర్ఘ పోరాటం ఫలితంగా అత్యన్నత న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా ఎస్సీల వర్గీకరణ జరగాలని తాము కోరుకున్నామని ఎక్కడో లోపం జరిగిందని లోపాన్ని సరిదిద్దేవారకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు …ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం నియమించిన కమిషన్ క్రిమీలేయర్ పెట్టాలని చెప్పినప్పటికీ ప్రభుత్వం పట్టకపోవడాన్ని మందకృష్ణ తప్పు పట్టారు …మంత్రి వర్గ ఉపసంఘంలో సభ్యునిగా ఉన్న దామోదర రాజనరసింహ వర్గీకరణ విషయంలో వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు …ఆయన్ను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు …అదే సందర్భం లో రెడ్లు నలుగురు మంత్రి వర్గంలో ఉన్నారని తమ మాదిగ జాతినుంచి కూడా ఇద్దరిని మంత్రివర్గంలో తీసుకోవాలని కోరారు …మరో వరం పది రోజుల్లో లక్ష డప్పులు , వేల గొంతుకల సాంస్కృతిక ప్రదర్శన ఉంటుందని తెలిపారు …ఇప్పటికే జిల్లాల నుంచి వేలాది వాహనాలు తమ కార్యకర్తలు హైద్రాబాద్ వచ్చేందుకు బుక్ చేసుకున్నారని డబ్బులు కూడా చెల్లించారని , లక్షలాది డబ్బులు కొనుగోలు చేశారని అందరి ఆకాంక్షలకు అనుగుణంగా హైద్రాబాద్ సాంస్కృతిక ప్రదర్శన ఉంటుందని అందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు …

Related posts

ప్రభుత్వ బడుల దుస్థితి.. విద్యార్థులు లేని స్కూళ్లలో తెలంగాణకు రెండో స్థానం

Ram Narayana

మూసీ పరీవాహక ప్రాంతంలో ఎవరూ భయపడవద్దు… అండగా ఉంటాను: మధుయాష్కీ

Ram Narayana

అల్లు అర్జున్ మామకు ఫోన్ చేశా…టీపీసీసీ చీఫ్..మహేష్ కుమార్ గౌడ్ ..

Ram Narayana