కాంగ్రెస్ వ్యహారాలు తెలంగాణ ఇంఛార్జిగా మీనాక్షి నటరాజన్ …
దీపదాస్ మున్షి అవుట్ …
9 రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జులను ప్రకటించిన కాంగ్రెస్..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా ఇప్పటివరకు ఉన్న దీపదాస్ మున్షి స్థానంలో కొత్త ఇంఛార్జిని ఏఐసీసీ నియమించింది …రాహుల్ గాంధీ టీం లో కీలకంగా ఉన్న మీనాక్షి నటరాజన్ ను తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంఛార్జిగా నియమించారు …ఇటీవలనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలెట్ తెలంగాణకు వచ్చి సీఎం , పీసీసీ అధ్యక్షులతో భేటీ అయ్యారు …అయితే ఆయన కొత్త ఇంఛార్జిగా వస్తారని అనుకున్నారు …ఆయన ఇక్కడ పరిస్టులను తెలుసుకొనేందుకు పార్టీగా దూతగా వచ్చినట్లు తెలుస్తుంది …దీపదాస్ మున్షి రాష్ట్ర వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు …
హిమాచల్ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, బీహార్ లాంటి 9 రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జులను నియమించింది … పంజాబ్, జమ్ము కశ్మీర్ కొత్త జనరల్ సెక్రటరీలు నియమితులైయ్యారు ….
ఎవరీ …మీనాక్షి నటరాజన్….
మీనాక్షి 2009లో మధ్యప్రదేశ్ లోని మాండసోర్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. రాహుల్ టీమ్ లో ఆమె కీలకంగా ఉన్నారు. 1999 నుంచి 2002 వరకు ఆమె ఎన్ఎస్యూఐ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2002 నుంచి 2005 వరకు మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 2008లో ఆమెను ఏఐసీసీ కార్యదర్శిగా రాహుల్ ఎంపిక చేశారు. ఆ తర్వాత 2009లో మాండసోర్ నుంచి ఎంపీగా గెలుపొందారు.
దీపాదాస్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి హైకమాండ్ కు పలు ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం. ఏకపక్షంగా ఆమె నిర్ణయాలను తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నేతల మధ్య సమన్వయం నెలకొల్పడంలో కూడా విఫలమయ్యారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఆమె స్థానంలో కొత్త ఇన్ఛార్జ్ ని నియమించారు. తెలంగాణలో పాటు ఒడిశా, జార్ఖండ్, బీహార్, మణిపూర్, తమిళనాడు, మధ్యప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జ్ లను హైకమాండ్ నియమించింది.
