తెలంగాణ వార్తలు

కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి!

  • నేడు 71వ పుట్టినరోజు జరుపుకుంటున్న కేసీఆర్
  • కేసీఆర్ కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నానన్న రేవంత్
  • రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు 71వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

‘గజ్వేల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం తెలిపారు.

కేసీఆర్ కు దేవుడు పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలి: జగన్

Jagan greetings ot KCR

నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు. ఈరోజు ఆయన 71వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ నాయకులు బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపారు. వైసీపీ అధినేత జగన్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 

“మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, పరిపూర్ణ జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు. కేసీఆర్ ను కలిసినప్పటి ఫొటోను షేర్ చేశారు.

కేసీఆర్ కు కేటీఆర్‌, హ‌రీశ్ రావు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు…

KTR and Harish Rao Birthday Wishes to KCR

ఈరోజు బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా సినీ, రాజ‌కీయ‌, ఇతర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు, అభిమానులు బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేస్తున్నారు. తాజాగా ఆయ‌న కుమారుడు కేటీఆర్‌, మేన‌ల్లుడు హ‌రీశ్ రావు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక కేసీఆర్ కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 

“ప్రతి తండ్రీ తమ బిడ్డకు హీరో. నా తండ్రి నా ఒక్కడికే కాదు, తెలంగాణకు కూడా హీరో కావ‌డం నా అదృష్టం. ఈ మాట‌కు ఆయన అర్థం ఏమిటో నిర్వచించారు కూడా. ఒక కల కనడం, దాని కోసం హద్దులేని నిబద్ధతతో బయలుదేరడం! విమర్శకులను ఎదుర్కోవడం, అది ఎలా నెరవేరుతుందో వారికి గర్వంగా చూపించడం! 

తెలంగాణ అనే కలను ప్రేమించడం, దాని కోసం పోరాడడం, మీ సొంత‌ జీవితం గురించి కూడా ఆలోచించకుండా దానిని సాధించడం! మీరు గర్వంగా మీ కొడుకు అని పిలుచుకునే వ్యక్తి కావడమే నా ఏకైక లక్ష్యం! ఈ పోరాటానికి, ఈ రాష్ట్రానికి, ఈ వారసత్వానికి అర్హుడిగా ఉండటానికి నా జీవితంలోని ప్రతి క్షణం కృషి చేస్తానని మీకు నా వాగ్దానం చేస్తున్నా. ప్రేరణతో నిండిన జీవితానికి ధన్యవాదాలు! పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 

తెలంగాణ ఉద్వేగం, ఉద్రేకం, ప్ర‌జాగ‌ళం, ఆత్మ‌గౌర‌వ ర‌ణం కేసీఆర్. మీరు నా తలనిమిరే తల్లిప్రేమ, నాకు ఎనలేని మమకారం పంచిన మేనమామ. నాకు రాజ‌కీయ చైత‌న్యాన్ని నేర్పించి, నాలో ప్రజా సేవా సంస్కారాన్ని రంగరించి, నన్ను ఉద్యమ కార్యాచరణలో నడిపించారు. త‌ద్వారా నాలోని నాయకత్వ గుణాన్ని ప్రేరేపించారు. నాకు పరిపాలనా  సామర్థ్యాన్ని కల్పించి నన్ను చరితార్థుణ్ణి చేసిన మీరు శత వసంతాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని హ‌రీశ్ రావు త‌న ట్వీట్ రాసుకొచ్చారు. 

Related posts

కొండా మురళి వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్

Ram Narayana

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి…

Ram Narayana

తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు

Ram Narayana