జాతీయ వార్తలు

క్వింటా మిర్చికి రూ.11,781 ధర ప్రకటించిన కేంద్రం

  • ఏపీలో మిర్చి రైతుల పరిస్థితిపై కేంద్రానికి చంద్రబాబు లేఖ
  • కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోనూ మాట్లాడిన ఏపీ సీఎం
  • క్వింటా మిర్చికి రూ.11,781 ధర ప్రకటించిన కేంద్రం

ఏపీ మిర్చి రైతుల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోనూ మిర్చి రైతుల అంశంపై మాట్లాడారు. 

ఈ నేపథ్యంలో, చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. ఏపీ మిర్చి రైతుల పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించింది. క్వింటా మిర్చికి రూ.11,781 ధర ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద ఈ మేరకు మిర్చికి ధరను ప్రకటించింది. ఈ ధరను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చెరి సగం భరించనున్నాయి.  

కాగా, ఏపీ నుంచి 2.58 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సేకరణకు కేంద్రం అవకాశం కల్పించింది. 2024-25 సీజన్ లో పండిన మిర్చికి వర్తించేలా తాజా ఉత్తర్వులు నెల రోజుల పాటు అమల్లో ఉంటాయని తెలుస్తోంది.

Related posts

నేను చూసుకుంటాను.. కుటుంబ వివాదంపై తొలిసారి నోరు విప్పిన లాలు ప్రసాద్ యాదవ్

Ram Narayana

మణిపూర్ లో ‘నో వర్క్ నో పే’.. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం ఆదేశాలు..!

Drukpadam

టెక్నాలజీలో భారత్ కీలక ముందడుగు.. ‘పాక్స్ సిలికా’ కూటమిలో చేరిక!

Ram Narayana