మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పలరింపులు ,పరామర్శలతో బిజీ బిజీ
మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం ఖమ్మంలో విస్తృతంగా పర్యటించారు …పలు శుభకార్యాల్లో పాల్గొన్నారు…నూతన వధూవరులకు ఆశీర్వాదములు తెలిపారు…మహిళాదినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు …ముస్లిం సోదరులు ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులు పాల్గొన్నారు … బానోత్ మదన్ లాల్ సోదరుడు పోలీస్ అధికారిగా పనిచేస్తూ ప్రమాదంలో మరణించగా వారి భౌతిక ఖాయాన్ని సందర్చించి నివాళులు అర్పించారు …
ఖమ్మం మమత క్యాంపస్ పువ్వాడ అజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయం నందు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మభ్యపెట్టి మహాలక్ష్మి,స్కూటీ లు గాని కళ్యాణ లక్ష్మి,ఉద్యోగం లేని మహిళలకు మూడు వేలు ఇస్తామని చెప్పి పథకాలు అమలులో మోసం చేసిందని అన్నారు.ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన మోసాలకు ప్రతి మహిళా అక్రోషం వెళ్ళగక్కుతూ ఉన్నారని అన్నారు …
రాబోయే రోజుల్లో చట్ట సభల్లో కూడా మహిళా రిజర్వేషన్ రాబోతుంది.రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ గాని పార్లమెంట్ లో గాని మహిళలకు అవకాశం కల్పిస్తామని అన్నారు ..
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ..

ఖమ్మం గట్టయ్య సెంటర్ మజీద్ ఈ హాలీమా ఖతున్ నందు ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు.రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని ముస్లిం మైనారిటీ సోదరులందరు ఎంతో నిష్టతో ఈ రంజాన్ మాసం ఉపవాస దీక్షలు చేస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం,
జిల్లా మైనారిటీ అధ్యక్షుడు తాజద్దీన్,మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్,టౌన్ అధ్యక్షుడు షంసుద్దీన్,మస్జిద్ కమిటీ సభ్యులు ఎండి సాబీర్ పాషా,ఎండి మన్నాన్,ఎండి రజాక్,ఎండిఖాజా,Skనయీమ్,
ఆఫీస్,జవాద్,అబ్దుల్ గఫార్,
ఖాజా మెనుద్దీ,అబ్బాస్,
ముజాహిద్,తోసిఫ్,పిరోజ్ ,మున్నా,చోటు,చంటి తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ వ్యాపారవేత్త కటకం గిరి కుమారుడు ఆకాష్ వెడ్స్ హష్మిత వివాహ రిసెప్షన్ కి హాజరై వదువరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..
మాజీ ఎమ్మెల్యే బానోత్ మదనలాల్ సోదరుడు డీఎస్పీ జవహర్ లాల్ నిన్న రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా ఈర్లపూడి గ్రామం నందు వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
జవహర్ లాల్ మృతి వారి కుటుంబానికి తీరని లోటని కుటుంబ సభ్యులను ఓదార్చి వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు.


మాజీ ఎంపిటిసి శంకర్ స్వామి మృతికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ..
పంగిడి మాజీ ఎంపిటిసి శంకర్ స్వామి ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు.
సామినేని నాగమణి మృతికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ..

ముదిగొండ మాజీ ఎంపిపి సామినేని హరిప్రసాద్ సతీమణి నాగమణి గారు ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా ఈరోజు వారి దశదిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు.
లింగా మల్లమ్మ మృతికి నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ..

పల్లెగూడెం సిపిఐ నాయకుడు లింగా వెంకట్ నారాయణ మాతృమూర్తి మల్లమ్మ గారు నిన్న అనారోగ్యంతో మృతిచెందగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు
పల్లెగూడెం సిపిఐ నాయకుడు లింగా వెంకట్ నారాయణ మాతృమూర్తి మల్లమ్మ గారు నిన్న అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబసభ్యులను పరామర్శించారు ..

బిఆర్ఎస్ 42వ డివిజన్ యువజన విభాగం అధ్యక్షుడు అబ్బాస్ కు మాజీ మంత్రి పువ్వాడ 5వేలు రూపాయలు ఆర్థిక సహాయం..
యువజన విభాగం అధ్యక్షుడు అబ్బాస్ ఇటీవల యాక్సిడెంట్ లో కాలు గాయమై చికిత్స పొందుతున్నాడు.విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అతని ఇంటికెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని 5వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.