తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి ,అద్దంకి , శంకర్ నాయక్

తెలంగాణ శాసనమండలికి కాంగ్రెస్ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్ ,విజయశాంతి ,శంకర్ నాయక్ లపేర్లను ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది …ఈమేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ పేరుతో ప్రకటన వెలువడింది …ఎమ్మెల్సీ ల రేసులో పరువురి పేర్లు పరిశీలించిన అధిష్టానం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లతో సుదీర్ఘంగా చర్చించ్చిన అనంతరం ఏఐసీసీ ఒక నిర్ణయానికి వచ్చి తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించినట్లు తెలిసింది …ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా బీఆర్ యస్ ఒక స్థానం దక్కించుకోనున్నది …మిత్ర ధర్మంలో భాగంగా సిపిఐ ఎన్నికల ఒప్పందంలో భాగంగా తమ పార్టీకి ఒక ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి , పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లను కల్సి విజ్ఞప్తి చేసింది …సిపిఐ వినతిని ఎన్నికల ఒప్పందాన్ని పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం నాలుగవ సీటును సిపిఐకి కేటాయించాలని నిర్ణయించింది …సిపిఐ తరుపున ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఒక నిర్ణయానికి వస్తుంది …ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నల్గొండ జిల్లా సిపిఐ కార్యదర్శి నలికంటి సత్యం , సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం…ఈ రోజు రాత్రికి అభ్యర్థిని సిపిఐ ఫైనల్ చేయనున్నది ..

Related posts

ప్రభుత్వమే స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది: ఈటల రాజేందర్

Ram Narayana

కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారంపై స్పందించిన మహేశ్ కుమార్ గౌడ్…

Ram Narayana

పార్టీ మార్పు వాఖ్యలకు చెక్ పెట్టిన విజయశాంతి.. మోదీ సభలోనే క్లారిటీ

Ram Narayana