Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆనందయ్యకు సెల్యూట్ చేస్తున్నాం: మద్రాస్ హైకోర్టు జడ్జిలు…

ఆనందయ్యకు సెల్యూట్ చేస్తున్నాం: మద్రాస్ హైకోర్టు జడ్జిలు
-కరోనా మందును ఉచితంగా తయారు చేసి అందిస్తున్నారు
-ఆనందయ్యను అభినందిస్తున్నాం
-ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి

ఆనందయ్య నాటు మందు పై మద్రాస్ హైకోర్టు జడ్జిలు సెల్యూట్ చేయడంతో మరోసారి ఆనందయ్య మందుపై చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆనందయ్య మందు పంపిణీకి ఒకే చెప్పినప్పటికీ ,కంట్లో వేసే చుక్కల మందు విషయంలో ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు రావడంతో నిలిచిపోయింది. అయితే కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. కేసు విచారం దశలో ఉంది. ఆనాదయ్య మందు దేశమేకాదు ప్రపంచ వ్యాపితంగా ఆశక్తి కనబరుస్తుంది… ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు జడ్జిల వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ….

కరోనాకు ఆనందయ్య ఇస్తున్న మందుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరోవైపు ఈరోజు మద్రాస్ హైకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా ఆనందయ్య మందు ప్రస్తావన వచ్చింది. ఏపీలో కరోనా మందు తయారు చేసి ఉచితంగా అందిస్తున్నారని ప్రశంసించింది.

ఈ సందర్భంగా ఆనందయ్యకు న్యాయమూర్తులు జస్టిస్ తమిళ్ సెల్వి, జస్టిస్ కరుణాకరణ్ సెల్యూట్ చేశారు. ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని వ్యాఖ్యానిస్తూ… ఆనందయ్యను అభినందించారు. డీఆర్డీవో తయారు చేసిన 2-డీజీ మందు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలు చేశారు.

మొదట బాగానే సహకరించిన ఏపీ సర్కార్ ఇటీవల సహకరించడం లేదని స్వయంగా ఆనందయ్య మీడియా ద్వారా వెల్లడించారు. తన చుక్కల మదిలో కూడా ఎలాంటి విషపదార్తలు లేవని ఆనందయ్య కోర్టుకు తెలిపాడు … అయితే ప్రభుత్వ వాదన మరోలా ఉంది . ఆనందయ్య గోళీల మందులు ఎలాంటి చెడు లేదని గోళీలను పంచేందుకు ఆనందయ్య కు అనుమతి ఇచ్చామని , కంట్లో వేసే మందు వివిధ లాబ్స్ లో పరీక్షలు నిర్వహించగా వాటిలో విషపదార్థాలు ఉన్నట్లు నిర్ధారించాయని పేర్కొన్నది . ఇదే విషయాన్నీ కోర్టుకు తెలిపింది. దీంతో కోర్టు పరీక్షల నివేదికలను అందజేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది .దీనిపై విచారం జరుగుతుంది.

Related posts

కబడ్డీలో కూతకు వెళ్లి మరణించిన కబడ్డీ ప్లేయర్!

Drukpadam

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా సౌదీ ఆరాంకో!

Drukpadam

మీరిచ్చిన జీవో ఏంటి? మీరు చెబుతున్నది ఏంటి?: సీఎస్​ వివరణపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం!

Drukpadam

Leave a Comment