ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

చిత్తూరులో కలకలం రేపిన కాల్పులు .. దోపిడీ ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు!

  • తుపాకులతో మాల్ యజమాని ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు
  • గాలిలోకి కాల్పులు జరిపి యజమానిని బెదిరించే ప్రయత్నం
  • మాల్ యజమాని అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
  • దుండగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

చిత్తూరులోని గాంధీ రోడ్డులో కాల్పులు కలకలం రేపాయి. లక్ష్మీ సినిమా హాల్ సమీపంలోని పుష్ప కిట్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని ఇంట్లోకి అర్ధరాత్రి ప్రవేశించిన దుండగులు వారిని బెదిరించేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే యజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని నలుగురు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు తుపాకులు, బుల్లెట్లతో పాటు పొగ బాంబులను కూడా స్వాధీనం చేసుకున్నారు. దుండగులను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ మణికంఠ చెందోలు పరిశీలించారు. మరో ఇద్దరు దుండగులు అక్కడే ఉన్నట్లు సమాచారంతో పోలీసులు గాలింపు చేస్తున్నారు. 

ప్రశాంతంగా ఉండే చిత్తూరులో కాల్పులు జరగడం స్థానికుల్లో తీవ్ర కలకలాన్ని రేపింది. ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. సకాలంలో పోలీసులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు. 

ఓ వ్యాపారి ఇంట్లో దోపిడీకి మరో వ్యాపారి పన్నాగం.. చిత్తూరు కాల్పుల ఘటనలో భారీ ట్విస్ట్

Big Twist In Chitturu Firing Incident
  • కర్ణాటక దోపిడీ ముఠాతో డీల్.. తుపాకులతో రంగంలోకి దిగిన గ్యాంగ్
  • దొంగల రాకతో అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యాపారి
  • ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు.. రెండున్నర గంటల ఆపరేషన్

చిత్తూరులో బుధవారం ఉదయం కలకలం సృష్టించిన కాల్పుల ఘటనలో సినిమాను మించిన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చిత్తూరు టౌన్ లోని గాంధీరోడ్డులో ఉదయం ఓ వ్యాపారి ఇంట్లోకి దొంగల ముఠా ప్రవేశించింది. గాలిలోకి కాల్పులు జరిపి వ్యాపారి కుటుంబ సభ్యులను బెదిరించింది. ఇల్లును దోచుకోవడానికి ప్రయత్నించగా.. వ్యాపారి అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు వ్యాపారి ఇంటిని చుట్టుముట్టారు. ఆక్టోపస్ బలగాలను రంగంలోకి దించి రెండున్నర గంటల పాటు ఆపరేషన్ నిర్వహించారు. దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించిన ఈ వ్యవహారంలో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. సదరు వ్యాపారిని దోచుకోవడానికి మరో వ్యాపారే ఈ దోపిడీకి ప్లాన్ చేసినట్లు బయటపడింది.

గాంధీరోడ్డులోని లక్ష్మీ సినిమా హాల్‌ సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్‌ వరల్డ్‌ యజమాని చంద్రశేఖర్‌ ఇంట్లోకి బుధవారం ఉదయం ఓ దొంగల ముఠా చొరబడింది. ఇంట్లోకి వచ్చీరావడంతోనే గాలిలోకి కాల్పులు జరిపి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను బెదిరించింది. దోపిడీ ముఠా ఇల్లు దోచుకునే ప్రయత్నంలో ఉండగా చంద్రశేఖర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటిని చుట్టుముట్టి ముఠాలోని ఐదుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. దొంగల నుంచి తుపాకులు, రబ్బర్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు దొంగలు పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ప్రాథమిక విచారణలో స్థానికంగా నివసించే ఎస్ఎల్వీ ఫర్నీచర్ యజమాని ఈ దోపిడీకి ప్లాన్ చేశాడని, పథకం ప్రకారం కర్ణాటక ముఠాను రంగంలోకి దించాడని తెలిసిందని పోలీసులు వివరించారు. విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.

Related posts

సాఫ్ట్ వెర్ ఉద్యోగం పేరుతో మోసం …

Ram Narayana

పన్నులు తగ్గినా పెరిగిన ఏపీ జీఎస్‌టీ ఆదాయం.. అక్టోబర్‌లో 8.77శాతం వృద్ధి!

Ram Narayana

బండి సంజయ్ యాత్రకు ఓకే …బట్ భైంసాలోకి నో ఎంట్రీ …!

Drukpadam