జర్నలిస్టుల కోసం ఒక పాలసీ తీసుకోని రావాల్సిన అవసరం ఉంది ..అసెంబ్లీలో కూనంనేని!
ఇందుకు ఒక కమిటీ వేయాలని ప్రభుత్వానికి సూచన…
నిజమైన జర్నలిస్టులను గుర్తించండి
వారి జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి …
నగరాల్లో ,గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేవారు ఎంతమంది ఉన్నారు
ఇందులో రెచ్చగొట్టేవారిని ,బ్లాక్ మెయిలు చేసేవారిని స్క్రీనింగ్ చేయాలి
మంచి జర్నలిస్టులను గుర్తించి వారికీ ఇల్లు ,ఇళ్లస్థలు పెన్షన్లు ఇవ్వాలి
హెల్త్ కార్డు లు అందజేయాలి …
ప్రభుత్వం నిజమైన జర్నలిస్టులను గుర్తించి, వారి సంక్షేమం కోసం ఒక పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలపై ఒక కమిటీ వేస్తే బాగుంటుందని సూచించారు. నిజమైన జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు.. వాళ్ల జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందులో పెద్ద పత్రికలలో పని చేసేవారు ఎంతమంది, నగరాలలో పని చేసేవారు ఎంతమంది, గ్రామాలలో పని చేసేవారు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని తెలిపారు. ఇందులో జర్నలిస్టుల పేరుతో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిని, బెదిరింపులకు గురి చేసేవారిని, బ్లాక్ మెయిల్ చేసే వారిని స్క్రీనింగ్ చేయాలని సూచించారు. అలాగే మంచి జర్నలిస్టులు అనేవారని గుర్తించి, వారికి ఆరోగ్యం, చదువులు, పెన్షన్, ఇళ్లు లాంటివి ఇచ్చేలా.. వారి సంక్షేమం కోసం ఒక మంచి పాలసీ తీసుకొని రావాలని సీఎం రేవంత్ రెడ్డి, సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు కొన్ని హమీలు ఇచ్చారని, అవి అమలు కావట్లేదని చెప్పి ఎమ్మెల్యేలు, ఎంపీలను అడిగే పరిస్థితి నెలకొన్నదని వారి సమస్యల గురించి పట్టించుకోవాలని కోరారు. నిబంధనలు అడ్డువస్తే జర్నలిస్ట్ లను పేదలుగా గుర్తించైనా వారికి ఇంటిస్థలాలు, ఇండ్లు ఇవ్వాలని కూనంనేని ప్రభుత్వాన్ని కోరారు.