హైద్రాబాద్ వార్తలు

రేపటి నుంచి నెహ్రు ఓ ఆర్ ఆర్ పై టోల్ బాదుడు ….

  • రేపటి నుంచి అమల్లోకి రానున్న పెరిగిన ఛార్జీలు
  • కిలోమీటరుకు 10 పైసల నుంచి 70 పైసల వరకు పెంపు
  • ఓఆర్ఆర్‌పై టోల్ వసూలు చేస్తోన్న ఐఆర్బీ ఇన్ఫ్రా

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. వివిధ వాహనాలకు కిలోమీటరుకు 10 పైసల నుంచి 70 పైసల వరకు ఛార్జీలు పెరిగాయి. కారు, జీపు, లైట్ మోటార్ వాహనాలకు కిలోమీటరుకు 10 పైసలు పెంచారు. దీంతో ప్రస్తుతం ఉన్న ఛార్జీ రూ.2.34 నుంచి రూ.2.44కు పెరిగింది.

మినీ బస్ మరియు ఎల్‌సీవీలకు 20 పైసలు పెంచారు. ఈ వాహనాలకు కిలోమీటరుకు ఛార్జీ రూ.3.77 నుంచి రూ.3.94కు పెరుగుతుంది. డబుల్ యాక్సిల్ బస్సులకు కిలోమీటరుకు రూ.6.69 నుంచి రూ.7కు పెంచారు. భారీ వాహనాలకు రూ.15.09 నుంచి రూ.15.78కి పెంచారు. 

ఓఆర్ఆర్ పై ఐఆర్బీ ఇన్‌ఫ్రా సంస్థ టోల్ వసూలు చేస్తోంది. పెరిగిన ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. 

Related posts

హుస్సేన్ సాగర్ లో గరిష్ఠ స్థాయికి చేరిన నీటిమట్టం.. లోతట్టు ప్రాంతాల వారికి హెచ్చరిక

Ram Narayana

హైదరాబాద్‌లో కూల్చివేతలు… హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం!

Ram Narayana

నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల కాల్పులు.. ఇద్దరికి గాయాలు

Ram Narayana