జాతీయ వార్తలు

సామాన్యుల‌కు షాక్‌… భారీగా గ్యాస్ ధ‌రల పెంపు!

  • వంట గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ. 50 పెంచిన కేంద్రం
  • ఈ మేర‌కు కేంద్ర‌మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరి ప్ర‌క‌ట‌న‌
  • ఉజ్వల ప‌థ‌క ల‌బ్ధిదారులు, జనరల్ కేటగిరీ వినియోగదారులు ఇద్ద‌రికీ ఈ ధ‌ర‌లు వ‌ర్తింపు 
  • రేప‌టి నుంచే కొత్త ధ‌ర‌లు అమ‌ల్లోకి

వంట గ్యాస్ ధరను పంపిణీ సంస్థలు సిలిండర్‌కు రూ.50 పెంచాయని కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పూరి సోమవారం వెల్ల‌డించారు. జనరల్ కేటగిరీ వినియోగదారులతో పాటు ఉజ్వల ప‌థ‌క ల‌బ్ధిదారుల‌కు కూడా ఈ పెంపు వ‌ర్తిస్తుంద‌న్నారు. రేప‌టి నుంచే కొత్త ధ‌ర‌లు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని మంత్రి తెలిపారు.

ఈ పెంపుతో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర సాధారణ వినియోగదారులకు రూ. 803 నుంచి రూ. 853కు, ఉజ్వ‌ల్ సిలిండ‌ర్‌ రూ. 503 నుంచి రూ. 553కు చేర‌నుంది. అటు… పెట్రోల్‌, డీజిల్‌పై లీట‌ర్‌కు రూ. 2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని పెంచ‌గా, ఆ భారాన్ని చ‌మురు కంపెనీలే భ‌రించ‌నున్నాయి. 

Related posts

అమృత్‌సర్‌లో ఎంపీ అభ్యర్థి ప్రచారంలో కాల్పుల కలకలం…

Ram Narayana

ఢిల్లీ హైకోర్టు వర్చువల్ విచారణ.. కెమెరా ఆన్‌లో ఉండగానే మహిళకు లాయర్ ముద్దు..!

Ram Narayana

మధ్యప్రదేశ్ లోని 17 ఆధ్యాత్మిక నగరాల్లో మద్యం షాపుల క్లోజ్‌!

Ram Narayana