YS Jagan Mohan Reddy
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

వైసీపీ పీఏసీని ప్రకటించిన జగన్

  • కన్వీనర్ గా వ్యవహరించనున్న సజ్జల రామకృష్ణా రెడ్డి
  • పీఏసీలో శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శనివారం పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో 33 మంది సభ్యులను నియమించారు. ఈ రాజకీయ సలహాల కమిటీకి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణా రెడ్డి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఈ పీఏసీలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. కొంత మంది మినహా దాదాపు వైసీపీలో కీలక నేతలందరికీ ఈ కమిటీలో స్థానం దక్కింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం సభ్యుల జాబితాను విడుదల చేసింది. ఎంపీలు అవినాశ్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు రోజా, విడదల రజని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేశ్, నారాయణస్వామి, అనిల్ కుమార్ యాదవ్, ముద్రగడ పద్మనాభం, సాకే శైలజానాథ్, నందిగం సురేశ్ తదితరులకు ఈ కమిటీలో స్థానం దక్కింది.

Related posts

పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ ధోనీలా తయారుకావాలి: జగన్

Ram Narayana

‘బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారెంటీ…చంద్రబాబు 45 రోజుల ప్రచారం..!

Ram Narayana

ప్రతి ఎన్నిక మనకు పరీక్ష వంటిదే …చంద్రబాబు

Ram Narayana