MLC Kalvakuntla Kavitha
తెలంగాణ వార్తలు

ఖమ్మంలో ఎమ్మెల్సీ కవిత పరామర్శలు

  • పువ్వాడ నాగేశ్వర రావును పలకరించిన కవిత
  • బీఆర్ఎస్ నేత ఆర్జేసీ కృష్ణను కలిసి పరామర్శ
  • నాయకురాలి కొడుకు రిసెప్షన్ కు హాజరు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు రోజుల పర్యటన కోసం బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ఖమ్మం వచ్చారు. ఆమెకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. తొలి రోజు ఆమె ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి, మర్యాద పూర్వకంగా సీపీఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వర రావును ఇంటికి వెళ్ళి కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు, పార్టీ నేత, మాజీ ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మెన్ ఆర్జేసీ కృష్ణను కలిసి పరామర్శించారు. ఆయన కాలుకి ఇటీవల గాయం కాగా, ఇప్పుడే కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా కృష్ణ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కవిత, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆ తర్వాత, జాగృతి నాయకురాలు గట్టు అరుణ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన నూతన దంపతులను ఆశీర్వదించారు. సోమవారం ఉదయం ఆమె భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం తెలంగాణ ఉద్యమ కారులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత, పర్ణశాల వెళతారు.

Related posts

జపాన్‌లో రేవంత్ బృందానికి గ్రేట్ డిన్నర్

Ram Narayana

అర్హుల పొట్ట కొట్టు.. బందిపోట్లకు పెట్టు: వైఎస్ షర్మిల ఆగ్రహం…

Drukpadam

ఆరు రోజుల్లో లక్ష దరఖాస్తులు.. రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల ముందు భారీ క్యూ!

Ram Narayana