JD Vance
అంతర్జాతీయం

జేడీ వాన్స్ ఫ్యామిలీకి ఏనుగులతో ఘన స్వాగతం

  • అమెరికా ఉపాధ్యక్షుడి కుటుంబానికి జైపూర్లో ఘ‌న స్వాగ‌తం
  • అంబర్ కోటను సందర్శించిన జేడీ వాన్స్ ఫ్యామిలీ

వారికి రాజస్థానీ నృత్య ప్రదర్శన, అందంగా అలంకరించబడిన ఏనుగులతో ఘన స్వాగతం పలికారు. జేడీ వాన్స్ కుటుంబ‌ స‌మేతంగా నాలుగు రోజుల పర్యటన కోసం సోమ‌వారం భార‌త్‌కు వచ్చింది. నిన్న ప్రధాని మోదీతో భేటీ అనంత‌రం విందులో పాల్గొన్న వాన్స్, రాత్రి  తన కుటుంబంతో కలిసి ఢిల్లీ నుంచి జైపూర్ చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా అంబర్ కోట వద్ద వాన్స్ కుటుంబానికి హృదయపూర్వక, ఉత్సాహభరితమైన స్వాగతం లభించింది. వారికి సాంప్రదాయ రాజస్థానీ నృత్య ప్రదర్శన, అందంగా అలంకరించబడిన ఏనుగులతో స్వాగతం పలికారు. తర్వాత‌ ఆయన రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్ (ఆర్ఐసీ)లో అమెరికా- భార‌త్‌ సంబంధాలపై ఉపన్యాసం ఇస్తారు. రాజస్థాన్ రాజధానిలోని సిటీ ప్యాలెస్‌ను సందర్శిస్తారు. వారు బుధవారం ఉదయం ఆగ్రాకు బయలు దేరి వెళతారు. అనంత‌రం వాన్స్ కుటుంబం గురువారం తెల్లవారుజామున అమెరికాకు తిరిగి బయలుదేరుతుంది.

Related posts

సునీతా విలియమ్స్… అంతరిక్షమే ఇల్లు, ధైర్యమే ఊపిరి…

Ram Narayana

ట్రంప్ తో చర్చలకు పుతిన్ రెడీ…

Ram Narayana

బలూచిస్థాన్ లో పాక్ కొత్త చట్టం … సైన్యానికి మరింత పవర్!

Ram Narayana