Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్

అలా మాట్లాడే వారు పాకిస్తాన్ వెళ్ళి పోండి – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్

పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడే వారినుద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. జమ్ము కాశ్మీర్లో మ‌త ప్రాతిప‌దిక 26 మందిని చంపినా పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడ‌టం స‌రి కాద‌న్నారు. అలా మాట్లాడాల‌నుకుంటే ఆ దేశానికే వెళ్లి పోవాల‌ని అన్నారు.ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగ‌ళ‌గిరిలోని సీకే క‌న్వెన్షన్ హాలులో జ‌న‌సేన నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ ఉగ్రవాదం, హింసపై అంద‌రూ ఒకేలా స్పందించాల‌ని అన్నారు. ఇలాంటి విష‌యాల‌పై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడ‌కూడ‌ద‌ని హితవు పలికారు. ఉగ్రఘ‌ట‌న‌లో జ‌న‌సేన ఓ కార్యక‌ర్తను కోల్పోయింద‌ని ప‌వ‌న్ గుర్తు చేశారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కావ‌లికి చెందిన మ‌ధుసూద‌న్‌ రావు ఫ్యామిలీకి పార్టీ త‌ర‌ఫున రూ.50ల‌క్షల ఆర్థిక సాయం ప్రక‌టించారు. “చ‌నిపోయిన మ‌ధుసూద‌న్‌రావు ఎవ‌రికి హాని చేశారు. కుటుంబాన్ని తీసుకుని క‌శ్మీర్‌కు వెళ్తే చంపేశారు. క‌శ్మీర్ మ‌న‌ది కాబ‌ట్టే అక్కడికి వెళ్లామ‌ని మ‌ధు భార్య చెప్పారు. హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటే. ఇక్కడ కూడా ఉండొద్దంటే ఎక్కడికి పోవాలి. మ‌త క‌ల‌హాలు సృష్టించేవారి ప‌ట్ల అప్రమ‌త్తంగా ఉండి ఎదుర్కోవాలి. యుద్ధ ప‌రిస్థితులు వ‌చ్చినా సిద్ధంగా ఉండాలి” అని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. 

Related posts

మోదీ పర్యటనను బహిష్కరిస్తున్న సీఎం కేసీఆర్…అధికారికంగా ప్రకటించిన …కేటీఆర్

Drukpadam

సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్లో కర్ణాటక, స్టార్టప్‌లలో మహారాష్ట్ర టాప్: కేంద్రం!

Drukpadam

కలెక్టర్ ఓవరాక్షన్ -సీఎం క్షమాపణ

Drukpadam