CPI Narayana
తెలంగాణ రాజకీయ వార్తలు ..

అందాల పోటీ అంటే … స్తీ జాతిని నడి రోడ్డుపై వేలం వేయడం కాదా ?  సీపీఐ నేత నారాయణ సూటి ప్రశ్న

  • హైదరాబాద్‌లో అందాల పోటీల నిర్వహణపై మండి పాటు
  • రేవంత్ రెడ్డి స్త్రీ జాతిని అవమానిస్తున్నారని ఆగ్రహం
  • మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించాలని ప్రభుత్వానికి సూచన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సీపీఐ నేత నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో అందాల పోటీలు నిర్వహించనుండటంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతి జిల్లా గూడూరులో తన మేనకోడలికి చెందిన ఓ వాణిజ్య సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, దీనిపై మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అందాల పోటీలు నిర్వహించడం ద్వారా పవిత్రమైన స్త్రీ జాతిని అవమానిస్తున్నారని నారాయణ విమర్శించారు. “అందాల పోటీ అంటే స్త్రీలను నడి రోడ్డు మీద వేలం వేయడం కాదా? ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి పోటీలు నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుద్ధి లేదు” అని ఆయన తీవ్ర స్థాయిలో ద్వజ మెత్తారు. మిస్ వరల్డ్ పోటీలకు రూ.25 కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వాలు మహిళలను స్వయం శక్తితో జీవించేలా ప్రోత్సహించాలని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని నారాయణ సూచించారు. అందాల పోటీల పేరుతో స్త్రీల గౌరవాన్ని కించ పరచడం సరి కాదని, ఈ పోటీలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఆయన పిలుపు నిచ్చారు. తన మేనకోడలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి, పది మందికి ఉపాధి కల్పించేందుకు సొంత వ్యాపారం ప్రారంభించడాన్ని ఆయన అభినందించారు.

Related posts

నా భుజంపై చేయి వేసి రాహుల్ గాంధీ గెలిపించమంటే ప్రజలు నన్ను ఓడించారు: జగ్గారెడ్డి

Ram Narayana

ఘన్‌పూర్ టిక్కెట్ దక్కలేదని వెక్కివెక్కి ఏడ్చిన ఎమ్మెల్యే రాజయ్య

Ram Narayana

10 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారారు: స్పీకర్ ను కలిసిన అనంతరం కేటీఆర్

Ram Narayana