Heavy Rains in Vijayawada
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో ఏక దాటిగా వర్షం

విజయవాడ నగరంతోపాటు రూరల్ ప్రాంతాల్లో ఏక ధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వర్షాలు కురిసినప్పటికీ ఆదివారం ఏకధాటిగా కురిసిన వర్షాలకు పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. దీంతో జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించి పోయింది. ప్రధాన రహదారులపై నీరు నిలిచి పోయింది. దీంతో జిల్లా కలెక్టర్ అంతటి అధికారి రోడ్డుపైకి వచ్చి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రైతులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నాయి. సహజంగా మే నెలలో భానుడు భగభగమందుతాడు. కానీ అందుకు భిన్నంగా ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎండ దాటికి అలమటిస్తున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగిస్తుందనుకుంటే, అంత కంత పెరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

Related posts

విద్యుత్ బిల్లు ప్రతి నెలా మీరు చెల్లించక్కర్లేదు.. పేటీఎంలో ఆటో పే ఆప్షన్!

Drukpadam

టీడీపీ విరాళాల వెబ్ సైట్ ప్రారంభించిన చంద్రబాబు… తనవంతుగా రూ.99,999 విరాళం

Ram Narayana

సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్

Ram Narayana