తెలంగాణ వార్తలు

ఉద్యమకారులేవరూ అధైర్య పడొద్దు

  • గత ప్రభుత్వం మనల్ని ప్రక్కకు నేట్టింది
  • ఈ ప్రభుత్వమైనా కాస్త గుర్తించింది
  • టీజేఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరాం

ఉద్యమకారులు ఎవరూ అధైర్యపడొద్దని తెలంగాణ జన సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మంలో తెలంగాణ జన సమితి జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రాంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కోదండరాం మాట్లాడుతూ ఖమ్మం జిల్లా లో క్రియా శీలక పాత్ర పోషించడమే తమ పార్టీ ముందు ఉన్న లక్ష్యమని చెప్పారు. విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న నాయకులకు ఎప్పుడూ ప్రాధన్యత ఉంటుందన్నారు. కొట్లాడి తెలంగాణ తెచ్చిన దాంట్లో మనం ముందు వరసలో ఉన్నామని, ఇపుడు చివరి వరుసలోకి నెట్టి వేయబడడానికి గత పాలకుల కుటిలత్వమే కారణమన్నారు . జై తెలంగాణ అంటే ఆనాడు నవ్విన వాళ్ళు ఉన్నారని, కొందరు ఆంధ్ర నాయకులు హేళన చేసి అవమానిస్తే రక్తం సల సల మరిగేదని అన్నారు. ఎంత అవమానించినా మొక్కవోని దీక్షతో పోరాడామని, ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. తెలంగాణ వస్తె బ్రతుకుతో పాటు బ్రతుకు దెరువు ఉంటదనుకున్నాం కానీ, తెలంగాణ వచ్చాక మనల్ని పక్కకు నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పోరాడినందుకు కనీసం ఇల్లైనా ఇస్తారనుకున్నాం, అదీ ఇవ్వలేదన్నారు. ఈ ప్రభుత్వంలో కాస్త గుర్తింపు వచ్చిందని, కౌన్సిల్లో కూడా ఉద్యమ కారుల సమస్యలను లేవనెత్తానని చెప్పారు. ప్రతి ఉద్యమ కారుడికి 250 గజాల జాగా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యమ కారుల మిగిలిన ఫలాల కోసం కూడా పోరాడాల్సిన అవసరం వుందన్నారు. సభ ప్రారంభానికి ముందు కోదండరాం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గోపగాని శంకర్రావు, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులుగా షేక్ సర్దార్ హుస్సేన్ , తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్ కుమార్ , రాష్ట్ర యువజన సమితి రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ సలీం పాషా , తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ కేవీ కృష్ణారావు, ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షులు పసుపులేటిన నాసరయ్య , ఖమ్మం నగర నాయకులు ఎస్కే మహబూబ్ బాషా , జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు ప్రసాద్ , వైరా నియోజక వర్గ నాయకులు ఎస్కే అక్బర్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు .

Related posts

కేపీహెచ్‌బీలో భూమికి రికార్డు ధర.. ఎకరం ఏకంగా రూ. 70 కోట్లు!

Ram Narayana

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..

Ram Narayana

నల్లగొండ జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన మూసీ.. రాకపోకల బంద్…

Ram Narayana