అంతర్జాతీయం

ముగిసిన భారత్, పాకిస్థాన్ డీజీఎంఓల హాట్‌లైన్ సంప్రదింపులు!

  • డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) స్థాయి భేటీ
  • హాట్‌లైన్ ద్వారా మాట్లాడుకున్న రాజీవ్ ఘాయ్, కాశిప్ చౌదరి
  • చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై ఉత్కంఠ!

భారత్, పాకిస్తాన్ దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓలు) మధ్య నేడు చర్చలు జరిగాయి. హాట్‌లైన్ ద్వారా భారత డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్థాన్ డీజీఎంఓ మేజర్ జనరల్ కాశిప్ చౌదరి సంభాషించారు. సైనిక కార్యకలాపాలకు సంబంధించిన కీలక బాధ్యతలు నిర్వర్తించే ఈ ఉన్నతాధికారుల మధ్య తొలి దశ సంప్రదింపులు సాయంత్రం ముగిశాయి.

వాస్తవానికి మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన చర్చలు, సాయంత్రానికి వాయిదా పడ్డాయి. కాల్పుల విరమణ, ఉద్రిక్తతల తగ్గింపు, పీఓకే తదితర అంశాలపై డీజీఎంఓలు చర్చించి ఉంటారని భావిస్తున్నారు.

సాధారణంగా ఇరు దేశాల డీజీఎంఓల మధ్య హాట్‌లైన్ ద్వారా లేదా ఇతర ప్రత్యేక మార్గాల ద్వారా సంప్రదింపులు జరుగుతుంటాయి. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, కాల్పుల విరమణ ఒప్పందాల అమలు, అనుకోని సంఘటనల నివారణ వంటి అంశాలపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారిస్తారు. ఇరు సైన్యాల మధ్య సమన్వయం, సమాచార మార్పిడికి ఈ వ్యవస్థ అత్యంత కీలకంగా పనిచేస్తుంది.

అయితే, నేటి చర్చల్లో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకున్నారా అనే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు, సరిహద్దుల్లో శాంతి స్థాపన దృష్ట్యా డీజీఎంఓ స్థాయి చర్చలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

హాట్‌లైన్ చర్చలు… సింధు జలాలపై మాట్లాడేందుకు పాక్‌కు అవకాశమివ్వని భారత్!

India Refuses to Discuss Indus Waters with Pakistan During Hotline Talks

భారత్, పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) మధ్య హాట్ లైన్ చర్చలు ముగిశాయి. కాల్పుల విరమణ, సైనిక చర్యల నిలుపుదల ఒప్పందాన్ని కొనసాగించడంపై ఇరు దేశాల డీజీఎంఓలు ఈ సందర్భంగా చర్చించారని సమాచారం. అయితే, ఈ చర్చల్లో సింధు నదీ జలాల ఒప్పందం ప్రస్తావనకు రాలేదని తెలుస్తోంది.

చర్చల్లో భాగంగా ఈ ఒప్పందం రద్దు అంశాన్ని లేవనెత్తాలని పాకిస్థాన్ ప్రయత్నించినప్పటికీ, అందుకు అవకాశం లభించలేదని జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు ఉద్దేశించిన అవగాహనపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

మరోవైపు, భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయంగా భద్రతా పరమైన సంసిద్ధతపై దృష్టి సారించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, నేడు ముంబైలోని తన అధికారిక నివాసం ‘వర్ష’లో కీలక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి భారత సైన్యం, నౌకాదళం, వాయుసేనకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సమీక్షించారని తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని రాజకీయ పార్టీల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన ఆ లేఖలో కోరారు. ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసేందుకు ప్రధానిగా మోదీ వ్యక్తిగతంగా ఈ సమావేశంలో పాల్గొనాలని కూడా ఎంఏ బేబీ విజ్ఞప్తి చేశారు.

Related posts

విదేశాంగ మంత్రి జైశంకర్ పై లండన్ లో దాడికి ఖలిస్థానీ మద్దతుదారుల యత్నం!

Ram Narayana

చైనా సాయంతోనే పాక్ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం: ప్రధాని షెహబాజ్ షరీఫ్

Ram Narayana

వెనిజులా తీరం వెంబడి అమెరికా B-52 బాంబర్ల చక్కర్లు..

Ram Narayana