తెలంగాణ వార్తలు

ఉచితాల పై సీనియర్ మంత్రి తుమ్మల మాటలు వైరల్ …

ప్రభుత్వ ఉచిత పథకాలపై తెలంగాణ సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొన్ని రోజుల క్రితం ఒక సభలో వ్యక్తం చేసిన మాటలు తూటాలు అయ్యాయి….పక్కన అధికారులు ఉన్నా ఒక కాబినెట్ మంత్రి తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టడం వైరల్ గా మరి రాష్ట్ర వ్యాపిత చర్చనీయాంశానికి దారితీశాయి … “ఉచితాలు ,ఉచితాలు అంటున్నాం …పక్కనున్న వాళ్ళు ఏమి అనుకోకపోతే (అధికారులు ) నిజమైన పేదలకు పథకాలు ఇవ్వాలి …కానీ జరుగుతుందా …?ఇదెక్కడి న్యాయం… “నాడు ఎన్టీఆర్ 3 రూపాయలు ఉన్న బియ్యాన్ని 2 రూపాయలకు ఇస్తే దేవుడని అన్నారు” …”నేడు బియ్యం ధర రూ 50 నుంచి 60 అయింది …ఉచితంగా ఇస్తున్నా మనల్ని ఏమి అనడంలేదు” కారణం పరిశీలించుకోవాలి ….
తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు ఒక గ్రామంలో 15 మంది ఉంటె తీసుకోని రండి అన్న మాటలు ఆలోచింప జేస్తున్నాయి… నిజమే కదా అంటున్నారు ..దీంతో మంత్రి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి …దీనిపై రాష్ట్రంలో రసవత్తర చర్చ జరుగుతుంది …మంత్రి అభిప్రాయపడినట్లు ప్రభుత్వ పథకాలు నిజమైన పేదలకు అందాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి…మంత్రిగారికి మద్దతు పెరిగింది … కల్తీ , అవినీతి అనేది అతి భయంకరంగా ఉంది, అది లేని వ్యవస్థ కావాలి …విద్య ,వైద్యం ఉచితం చేసి పథకాలు నిజమైన పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచనలు వస్తున్నాయి… రాష్ట్రంలో కోటి కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి…మరి కొంతమందికి కొత్తగా ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుంది …అంటే రాష్ట్రంలో సుమారు 3 కోట్ల 80 లక్షల జనాభా ఉంటె రేషన్ పొందేవారి సంఖ్య 3 కోట్ల 10 లక్షలకు చేరుకుంటుందని అంచనా …కోటి 20 లక్షల కార్డులు ఉన్నాయని లెక్కలు చెపుతున్నాయి … రేషన్ కార్డులేని వారిలో ఉద్యోగులే అధికం … అసలు కార్డు లేని వాళ్ళు ఎవరో చెప్పండని అంటున్నారు …

ప్రభుత్వ వాగ్దానాల అమల్లో వైఫల్యాలు …

వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లబ్దిపొందేందుకు అనేక వాగ్దానాలు చేస్తున్నాయి…అందులో ప్రధానంగా ఉచిత పథకాలు అధికంగానే ఉంటున్నాయి…వాగ్దానాలు చేయడం తర్వాత చేతులెత్తేయడం పాలకులకు పరిపాటిగా మారింది …ఇది అనేక దేశాల్లో ఉన్న మనదేశంలో ప్రధానంగా దక్షణాది రాష్ట్రాల్లో ఉచిత పథకాలపై ఎన్నికల్లో ఉదరగొట్టడం జరుగుతుంది… ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాగ్దానాలు అధికంగా ఉంటున్నాయి…తమిళనాడులో సైతం లాప్ టాప్ లు , మిక్సీలు ,గ్రైండర్లు , టీవీలు వాగ్దానాలు చేసి నాణ్యత లోపంతో అందజేయడం విమర్శలకు దారితీసింది ….తమిళనాడులో ఎన్నికల్లో ఇచ్చిన ఒక మిక్స్ కొన్న ఖమ్మం వాసి ప్రదీప్ తాము కొన్న మిక్స్ మూడు సార్లు మాత్రమే పనిచేసిందని వాపోయారు …ఇలాంటివి కోకొల్లలు …

ఇక మన రాష్ట్రానికి వస్తే 2023 ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు హామీ ఇచ్చింది …కొన్నిటిని అమలు చేసి మరికొన్నింటిపై పిల్లి మొగ్గలు వేస్తుంది …ప్రధానంగా ఉచిత బస్సు పథకం బాగానే ఉన్నా మహిళలందరికీ ఉచితంపై మిశ్రమ స్పందన ఉంది …ఉచిత బస్సు లో పేద మహిళలు ప్రయాణాలు చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు …కానీ ఉద్యోగులు ,ధనవంతులు , ప్రయాణం చేయడం పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి… ఇలాంటి స్కిమ్ లు పెట్టే ముందు ఆలోచన చేయాలనీ లేక పొతే ఆర్థిక భారం రాష్ట్ర ఖజానాపై పడి ఇబ్బందులు తప్పవని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు … ప్రయాణాల్లో రాయితీ ఇస్తే సరిపోయేదని అంటున్నారు …ఇక గ్యాస్ సిలిండర్ పథకం ఇది కూడా అమలు అవుతున్న ప్రజల్లో మాత్రం ప్రభుత్వంపై ఏ మాత్రం జాలి దయ కనిపించడం లేదు …రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ వాగ్దానం రైతులను సంతృప్తి పరచలేకపోయింది…రైతు బందును రైతు భరోసా గా మార్చినా , రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేక విమర్శలకు గురి అవుతుంది …బీఆర్ యస్ హయాంలో ఎకరాకు సంవత్సరానికి రెండు విడతల్లో 10 వేల రూపాయలు ఇస్తుండగా తాము ఎకరాకు 15 వేలు రైతు భరోసాగా ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ చివరకు 12 వేలు ఇస్తామని రైతుల ఖాతాల్లో అరకొరగా వేసింది …దీంతో ఇదేమి సర్కార్ అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు …

కల్యాణ లక్ష్మి , షాదిముబారక్ పథకాలకు లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తామని వాగ్దానం చేశారు …అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా దాని ఊసేలేదు …ఇక మహిళలకు ఇస్తామన్న 2 వేల పెన్షన్ , వుద్ద్దులకు ఇస్తామన్న 4 వేల పెన్షన్ కార్యరూపం దాల్చలేదు …సన్న బియ్యం పథకం పై ప్రచారం జరిగినా దాని అమలు పై సందేహాలు ఉన్నాయి… సీఎం రిలీఫ్ ఫండ్ పై పేద పేషంట్లు పెదవి విరుస్తున్నారు …

ఇక రిటైర్ అయినా ఉద్యోగులకు అందాల్సిన బెనిఫిట్స్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని 2027 నాటికీ ఇస్తామని ప్రభుత్వం పత్రాలు ఇస్తుంది …వారు దాచుకున్న పిఎఫ్ కూడా ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు … సీఎం రేవంత్ రెడ్డి భోళాశంకరుడిలాగా తన మనసులోని మాటలు బయట పెట్టారు .. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదని కుండబద్దలు కొట్టారు … అప్పుకోసం ఢిల్లీ వెళ్ళితే చెప్పులు ఎత్తుకొని వెళ్ళేవాళ్ళని చూసినట్లు చూస్తున్నారని, అప్పు పుట్టడం లేదని వాపోతున్నారు …ఇలాంటి పరిస్థితిల్లో రాష్ట్ర ఆదాయం నెలకు కేవలం 18 వేల 500 కోట్లు మాత్రమేనని ఇంతకు మించి తనను కోసినా డబ్బులు లేవని ఏమి చేస్తరు కోసుకొని తింటారా ..? అంటూ ఉద్యోగుల ,ఆర్టీసీ సిబ్బంది వేతనాల పంపు ,డి ఏ లు ఇవ్వాలని చేస్తున్న డిమాండ్లపై కుండబద్దలు కొట్టారు …సంపద సృష్టిస్తాం …ప్రజలకు పంచుతాం అన్న సర్కార్ మాటలు కార్యరూపం దాల్చకపోవడంపై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది … మరి సంపద సృష్టి ప్రజలకు పంచడం అనే ఆలోచనలు మంచివే అయినా ఆచరణలో పెట్టకపోతే ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి…

Related posts

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. ఉన్నతాధికారులతో భట్టివిక్రమార్క భేటీ!

Ram Narayana

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం .. అత్తపై అల్లుడు హత్యాచారం…

Ram Narayana

ముగిసిన కేటీఆర్ విచారణ… 7 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ

Ram Narayana