aarav malhotra
జాతీయ వార్తలు

అన్ని సబ్జెక్టుల్లో 100కు100 మార్కులు కొట్టేశాడు

సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లోనూ పిల్లలు అదరగొట్టారు. ముఖ్యంగా ఒక కుర్రాడు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు. అతనే ఎందుకు అంత పాపులర్ అయ్యాడో తెలిస్తే మీరు అతడ్ని అభినందించకుండా వుండలేరు. గ్రేటర్ నోయిడా (వెస్ట్)కు చెందిన 15 ఏళ్ల ఆరవ్ మల్హోత్రా, సీబీఎస్ఈ పదో తరగతి 2025 ఫలితాల్లో ఏకంగా 100% మార్కులు సాధించి సంచలనం సృష్టించాడు. ఇతని విజయం కేవలం ఫుల్ మార్కులు తెచ్చుకోవడమే కాదు, అతను ఎంచుకున్న సబ్జెక్టుల విషయంలోనూ ఎంతో ధైర్యం చూపించాడు. చాలా మంది విద్యార్థులు సేఫ్ సబ్జెక్టులనే ఎంచుకుంటే, ఆరవ్ మాత్రం ఒక అడుగు ముందుకేసి… తన ఆరో సబ్జెక్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను తీసుకున్నాడు. ఈ యంగ్ అచీవర్, మోడర్న్ టెక్నాలజీ సబ్జెక్టును తన అకడమిక్స్‌లో చేర్చుకుని, అందులోనూ 100కి 100 మార్కులు కొట్టేశాడు.

Related posts

మన్మోహన్ సింగ్ కు పూర్తీ అధికార లాంఛనాలతో ఘనవిడ్కోలు…!

Ram Narayana

భారత్‌లో ఓపెన్ఏఐ ఆఫీస్.. ఢిల్లీలో ఏర్పాటుకు అధికారిక ప్రకటన!

Ram Narayana

మొన్న ఐఫోన్, నేడు శాంసంగ్.. బిగ్ బాస్కెట్ లో మొబైల్ ఫోన్ల డెలివరీ!

Ram Narayana