Dairy Farmers
ఆంధ్రప్రదేశ్

పాడి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్…

పాడి రైతులకు వెన్నుదన్నుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పశు బీమాను ప్రవేశపెట్టింది. పశు బీమా ప్రీమియం 80% రాయితీ ఉంటుంది. పాడి రైతులు 20% శాతం చెల్లిస్తే, ప్రభుత్వం 80% శాతంచెల్లిస్తుంది. ఈ బీమా మూడు సంవత్సరాలు ఉంటుంది. పశువులకు బీమా 30 వేల రూపాయలు ఉంటుంది. 384 రైతు చెల్లిస్తే 1534 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. మూడేళ్లు పాటు బీమా వర్తిస్తుంది. పశువులు ఏ కారణం చేతనైనా మరణించినట్లయితే నష్ట పరిహారం కింద బీమా 30,000 రూపాయలు వర్తిస్తుందని పశు వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ పశు బీమా అనేది గొర్రెలు, మేకలకు కూడా వర్తిస్తుంది. ఈ గొర్రెలు, మేకలకు కూడా 80% రాయితీ ఉంటుంది. ప్రతి గొర్రెల, మేకల యజమానులు 50 నుంచి 100 గొర్రెల వరకు ఈ ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చని పశు వైద్యులు తెలియజేస్తున్నారు. ప్రీమియంలో 20% మాత్రమే రైతు చెల్లిస్తే సరి పోతుందని తెలుపుతున్నారు. ఏదైనా ప్రమాదవశాత్తు అవి చనిపోయినట్లయితే 6000 రూపాయలు ఇన్సూరెన్స్ లభిస్తుంది.

Related posts

ఏపీలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య!

Drukpadam

వివేకా రాసిన లేఖపై నిన్ హైడ్రిన్ టెస్టుకు సీబీఐ కోర్టు అనుమతి!

Drukpadam

విజయవాడలో విషాదం.. నిన్ననే కొన్న ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి వ్యక్తి మృతి.. భార్య పరిస్థితి విషమం!

Drukpadam