ఆంధ్రప్రదేశ్

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మొదట సారి స్పందించిన చంద్రబాబు … ఏమన్నారంటే ?

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ప్రవీణ్‌ మృతికి సంఘటనపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోనసీమ జిల్లా చెయ్యేరులో శనివారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పంపిణీలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు.’రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల సహజ మరణాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే ఎవరిని వదిలిపెట్టను’ అని హెచ్చరించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోనూ ఇదే రకంగా తనపై బురద చల్లారని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ‘ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే నాది డేగ కన్ను. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, డ్రోన్లు మీ వెనకాలే వెంటాడుతాయి, తోక కట్ చేస్తాయి’ అని అన్నారు. ‘తిరుమలలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుష్ప్రచారం చేస్తున్నారు. స్వార్థపరులు చెప్పే మాటలు గుడ్డిగా నమ్మొద్దు. ఎమోషనల్ కావొద్దు’ అని విజ్ఞప్తి చేశారు. ‘హైదరాబాద్‌లో గతంలో ఇదే రకంగా హిందూ ముస్లింలను చంపి మత కల్లోలాలు సృష్టించారు. ప్రశాంతమైన కోనసీమలోను విగ్రహాల రాజకీయాలు చేస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ‘ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి రాగానే పింఛన్‌లను పెంచాం. అధిక పింఛన్లు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రజల ఆదాయం పెంచి అన్ని విధాలుగా ఆదుకుంటాం. పేదలకు మూడు పూటలా అన్నం పెట్టాలనే సంకల్పంతో పని చేస్తున్నాం’ అని తెలిపారు.

Related posts

What Operational Excellence Really Means for Business Travel

Drukpadam

అల్లూరి జిల్లాలో లోయలో పడిన ఆర్టీసీ బస్సు… ఇద్దరి మృతి

Ram Narayana

ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్‌తో అట్టుడుకుతున్నపాకిస్థాన్!

Drukpadam