ఖమ్మంలో జరిగే సిపిఐ వందేళ్ల ఉత్సవాలకు అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి …
సిపిఐ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు
సిపిఐ జాతీయ కార్యదర్శి డి .రాజా ,రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని హాజరవుతారు
మూడు రోజులపాటు సిపిఐ జాతీయ కౌన్సిల్ ,కార్యవర్గ సమావేశాలు ఖమ్మంలోనే
ఖమ్మం చేరుకున్న వివిధ రాష్ట్రాల నాయకులు ..
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. సిపిఐ వందేళ్ళ ముగింపు ఉత్సవాలకు ఆయన అతిధిగా హాజరుకానున్నారు.ముఖ్యమంత్రి సిపిఐ బహిరంగ సభలో ఎలాంటి సందేశం ఇస్తారనే ఆసక్తి నెలకొన్నది …
షడ్యూల్ ప్రకారం ఉదయం 10:30 గంటలకు తన నివాసం నుంచి బేగంపేట విమానాశ్రయానికి ముఖ్యమంత్రి బయలుదేరుతారు. అక్కడి నుంచి 10:45 గంటలకు హెలికాప్టర్ ద్వారా పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురంలో ఏర్పాటుచేసిన ఎలిప్యాడ్ లో దిగుతారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అక్కడే స్థానిక సంస్థల ప్రతినిధులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అక్కడినుంచి ముఖ్యమంత్రి నేరుగా శ్రీ శ్రీ సర్కిల్ వద్ద గల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం రాఘవ నిలయానికి వెళ్తారు. అక్కడ భోజనం అనంతరం
2 .40 గంటలకు బయలుదేరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం లో జరిగే సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాల బహిరంగ సభలు పాల్గొని ప్రసంగిస్తారు. మూడు గంటల 50 నిమిషాలకు సర్దార్ పటేల్ స్టేడియంలోని హెలిప్యాడ్ నుండి బయలుదేరి నేరుగా మేడారం వెళతారు.
మొట్టమొదటిసారిగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వెలుపల మేడారంలో జరిగే రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ లో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మేడారంలో ఏర్పాట్లు చేసింది. రాత్రికి ముఖ్యమంత్రి మేడారంలో బస్సుచేసి మరుసటి రోజు అక్కడ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అనంతరం బయలుదేరి హైదరాబాద్ వెళ్తారు.
పాలేరు నియోజకవర్గ పరిధిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందుకోసం రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీ లో గల మద్దులపల్లి సమీపంలోని ప్రారంభించనున్న జేఎన్టీయూ నర్సింగ్ కళాశాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు. బందోబస్తు ఏర్పాట్లపై జిల్లా సిపి తో సమీక్ష నిర్వహించారు.