జాతీయ వార్తలు

ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు.. హాజరైన అమిత్ షా, నితిన్ గడ్కరీ

  • విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన అజిత్ పవార్
  • బారామతిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
  • పెద్ద ఎత్తున హాజరైన ఎన్సీపీ కార్యకర్తలు

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే తదితరులు హాజరయ్యారు. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున ఎన్సీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. 

నిన్న ఉదయం విమాన ప్రమాదం జరిగింది. రన్ వే పైకి దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు దుర్మరణం చెందారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం బారామతికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

అజిత్ పవార్ అంత్యక్రియల్లో నారా లోకేశ్..

Nara Lokesh Attends Ajit Pawar Funeral

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భౌతికకాయాన్ని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ సందర్శించి నివాళులు అర్పించారు. బారామతిలో నిర్వహించిన అజిత్ పవార్ అంత్యక్రియల్లో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. దివంగత అజిత్ పవార్ కు నివాళులర్పించిన వారిలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీనేత లావు కృష్ణదేవరాయలు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఉన్నారు.

మరోవైపు అజిత్ పవార్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. అంత్యక్రియలకు కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ హాజరయ్యారు. మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు, ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు కూడా హాజరయ్యారు.


Related posts

నాన్ వెజ్ విషయంలో గొడవ… మహిళా పైలెట్ ఆత్మహత్య!

Ram Narayana

అయోధ్యలో రామ్ దర్బార్‌లో విగ్రహాల ప్రాణప్రతిష్ఠ .. తెలంగాణ నుంచే వెళ్లిన ద్వారాలు

Ram Narayana

వాయిదాల పద్ధతిలో గోల్డ్ లోన్ చెల్లింపులు.. ఆర్బీఐ ఆలోచన…

Ram Narayana