అంతర్జాతీయం

ఐదేళ్ల తర్వాత.. చైనీయులకు పర్యాటక వీసాలను పునరుద్ధరించిన భారత్…

  • గల్వాన్ లోయ ఘటన తర్వాత భారత్, చైనా మధ్య నిలిచిన టూరిస్ట్ వీసాలు
  • తాజాగా, పర్యాటక వీసాలపై కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ
  • చైనా, హాంకాంగ్ పౌరులకు వీసాలు జారీ చేయడం కోసం మార్గదర్శకాలు

చైనీయులకు పర్యాటక వీసాలను భారత్ పునరుద్ధరించింది. గల్వాన్ ఘర్షణ తర్వాత గత ఐదేళ్లుగా భారత్, చైనా మధ్య పర్యాటక వీసాలు నిలిచిపోయాయి. గత కొద్దికాలంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా, ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. చైనా జాతీయులకు ఐదేళ్ల క్రితం నిలిచిపోయిన పర్యాటక వీసాలను పునరుద్ధరిస్తూ కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

మీడియా కథనాల మేరకు, పర్యాటక వీసాలపై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే, చైనా, హాంకాంగ్ పౌరులకు పర్యాటక వీసాలు జారీ చేయడం కోసం ఈ మార్గదర్శకాలను విడుదల చేసిందని తెలుస్తోంది.

దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి గత సంవత్సరం నుంచి ఆంక్షల సడలింపు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఇరుదేశాల ఒప్పందంతో విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. కైలాస్ మానస సరోవర్ యాత్రను కూడా తిరిగి ప్రారంభించారు.

Related posts

చైనాలో చెలరేగిపోతున్న చికున్ గున్యా..

Ram Narayana

జపాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాల ఢీ, 17 వాహనాలకు వ్యాపించిన మంటలు…

Ram Narayana

భారత్‌లో 2,500 పార్టీలు ఉన్నాయి … ప్రధాని మోదీ చెప్పగానే ఆశ్చర్యపోయిన ఘనా ఎంపీలు

Ram Narayana