జాతీయ రాజకీయ వార్తలు

నరేంద్ర మోదీపై ట్రంప్ ఒత్తిడి ఉంది: వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ…

  • వాణిజ్య ఒప్పందంపై అమెరికాతో రాజీపడ్డారన్న రాహుల్ గాంధీ
  • నెలలుగా నిలిచిపోయిన ఒప్పందం అకస్మాత్తుగా ఎలా ఖరారైందని ప్రశ్న
  • అంతా అయ్యాక ప్రతిష్ఠ మసకబారుతుందేమోనని మోదీ ఆందోళన చెందుతున్నారన్న రాహుల్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశాన్ని ట్రంప్‌కు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. వాణిజ్య ఒప్పందం విషయంలో అమెరికాతో రాజీపడ్డారని అన్నారు. ఆయన పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ, ట్రంప్ ఒత్తిడి కారణంగా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశారని, అంతా అయ్యాక ఇప్పుడు తన ప్రతిష్ఠ మసకబారుతుందేమోనని మోదీ ఆందోళన చెందుతున్నారని అన్నారు.

కొన్ని నెలలుగా నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందంపై నిన్న రాత్రి సంతకం చేశారని, అకస్మాత్తుగా ఇది ఎలా ఖరారైందని ఆయన ప్రశ్నించారు. ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉండటం వల్లే ఒప్పందం కుదిరిందని అన్నారు. ఎప్ స్టీన్ ఫైల్స్, అమెరికాలో వ్యాపారవేత్త అదానీపై కేసు వంటి వ్యవహారాలు దీనికి కారణమని ఆరోపించారు. ఎప్ స్టీన్ ఫైళ్లలో బయటికి రాని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయని అన్నారు. రైతుల కష్టాన్ని, దేశాన్ని అమ్మేశారని మండిపడ్డారు.

అంతకుముందు భారత ఆర్మీ మాజీ చీఫ్ నరవణే రాసిన ఆత్మకథలోని అంశాలపై లోక్‌సభలో రెండో రోజూ గందరగోళం కొనసాగింది. ప్రభుత్వం తనను సభలో మాట్లాడనివ్వలేదని రాహుల్ ఆరోపించారు. చరిత్రలో మొదటిసారి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడేందుకు ఒక ప్రతిపక్ష నేతకు అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు.

Related posts

వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్ కోరుతూ కరపత్రాలు ప్రింట్ చేయించిన పోలీసు అధికారి.. విధుల నుంచి తొలగింపు

Ram Narayana

బీజేపీపై అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు…

Ram Narayana

ప్రశాంత్ కిశోర్ పార్టీపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు…

Ram Narayana