Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

వివేకా హత్యకేసులో అనుమానితుడు అదృశ్యం.. గాలిస్తున్న సీబీఐ!

వివేకా హత్యకేసులో అనుమానితుడు అదృశ్యం.. గాలిస్తున్న సీబీఐ
సునీల్ కుమార్ పేరును వెల్లడించిన వాచ్‌మన్ రంగయ్య
సీబీఐ అధికారులు వేధిస్తున్నారంటూ హైకోర్టుకు సునీల్
ఆ తర్వాతి నుంచి అదృశ్యం
సునీల్ సమీప బంధువును అదుపులోకి తీసుకున్న సీబీఐ!

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అనుమానితుడైన సునీల్ కుమార్ యాదవ్ అదృశ్యమయ్యాడు. ఆయన కోసం సీబీఐ అధికారులు గాలిస్తున్నారు. విచారణ పేరుతో సీబీఐ అధికారులు తనను, తన కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ ఇటీవల ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. ఆ తర్వాతి నుంచి పులివెందులలోని సునీల్ కుమార్ ఇంటికి తాళం వేసి ఉంది. అప్పటి నుంచి సునీల్ కుమార్, ఆయన కుటుంబ సభ్యులు కనిపించకుండా పోవడంతో బంధువుల ఇంటికి వెళ్లి ఉంటారన్న సమాచారంతో సీబీఐ అధికారులు గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో సునీల్ సమీప బంధువు అయిన యువరాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. అనంతపురంలోని ఆయన బంధువుల ఇళ్లకు కూడా వెళ్లి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో సీబీఐ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కాగా, వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మన్ రంగయ్య ఇటీవల జమ్మలమడుగు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో సునీల్ కుమార్ యాదవ్ ,ఎర్ర గంగిరెడ్డి , మాజీ డ్రైవర్ దస్తగిరి పేర్లను కూడా వెల్లడించాడు.

గత సంవత్సర కాలంపైగా ఈ కేసును సిబిఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే . అనేక మందిని విచారించినప్పటికీ కేసు మిస్టరీ విడకపోవడంతో వివేకా కూతురు అసంతృప్తి తో ఉన్నారు. దీనిపై ఆమె ఢిల్లీ కూడా వెళ్లి సిబిఐ అధికారులను కలిశారు. తరువాతనే సిబిఐ మళ్ళీ రంగంలోకి దిగి కడప జైలు గెస్ట్ హౌస్ లో మకాం వేసి అనేకమందిని విచారించింది. రంగయ్య పొద్దుటూరు మేజిస్ట్రేట్ ముందు చెప్పిన ముగ్గురిని కూడా అనేక సార్లు విచారణ జరిపింది. ఎర్ర గంగిరెడ్డి నాకు ఏ పాపం తెలియదని అంటున్నారు. దస్తగిరి పై కూడా అనుమానాలు ఉన్నాయి. ఇక సునీల్ యాదవ్ తనకు సంబంధమే లేదని పేర్కొంటూ హైకోర్టు ను సైతం ఆశ్రయించారు. మాటిమాటికి తనను సిబిఐ వాళ్ళు వేధిస్తున్నారని కోర్టు కు మోర పెట్టుకున్నారు. అంతవరకూ బాగానే ఉన్న కనిపించకుండా పోవడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఏ లాంటి భయం లేకపోతె ఇంటిదగ్గరే ఉండాల్సిన సునీల్ ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడం సందేహాలు నెలకొన్నాయి.

 

Related posts

ఎంఎస్ ధోనీపై పరువునష్టం కేసు నమోదు.. రేపు విచారణ

Ram Narayana

టక్కరి యువతి బ్లాక్ మెయిల్.. యువకుడి ఆత్మహత్య

Drukpadam

పేపర్ లీకేజీ కేసులో కీలక పాత్ర రాజేశ్వర్ దే!

Drukpadam

Leave a Comment