జాతీయ రాజకీయ వార్తలు

త్రిషతో బంధం నుంచి బయటపడితేనే…!: విజయ్‌పై బీజేపీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు…

  • విజయ్ మొదట ఇల్లు దాటి బయటకు రావాలన్న నైనార్ నాగేంద్రన్
  • రాజకీయాల్లోకి వచ్చే ముందు ఇంటిని చక్కదిద్దుకోవాలని సూచన
  • వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడం సరికాదన్న కనిమొళి

ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్‌ని లక్ష్యంగా చేసుకుని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ మొదట ఇల్లు దాటి బయటకు రావాలని, త్రిషతో అనుబంధం నుంచి బయటపడితేనే రాజకీయాల్లో వాస్తవాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై డీఎంకే రాజ్యసభ సభ్యురాలు కనిమొళి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం సరికాదన్నారు.

విజయ్‌ని ఉద్దేశించి నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి. రాబోయే ఎన్నికల్లో ప్రధాన పోటీ తన పార్టీకి, డీఎంకేకు మధ్యే ఉంటుందని, బీజేపీ వంటి పార్టీలు రేసులో లేవని విజయ్ ఇటీవల బహిరంగసభలో వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై నాగేంద్రన్ స్పందిస్తూ, విజయ్‌కు రాజకీయాల పట్ల ఏమాత్రం అవగాహన లేదని ఎద్దేవా చేశారు. సినిమాల్లో డ్యాన్సులు వేసుకోవడానికే పరిమితమని చురక అంటించారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని హితవు పలికారు.

విజయ్ వ్యక్తిగత జీవితంపై మాట్లాడటం సరికాదని టీవీకే నాయకులు మండిపడ్డారు. అధికార డీఎంకే పార్టీ కూడా ఈ వ్యాఖ్యలపై తీవ్రంగానే స్పందించింది. కనిమొళి ‘ఎక్స్’ వేదికగా బీజేపీ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీలోని మహిళా నాయకులు నాగేంద్రన్ వ్యాఖ్యలను ఖండించకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగవద్దని వ్యాఖ్యానించారు. మహిళలను అవమానించేలా మాట్లాడటం సరికాదని అన్నారు.

Related posts

దేశసర్వోతోముఖాభివృద్దికి బీజేపీలో చేరండి …డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి

Ram Narayana

హర్యానాలో కాంగ్రెస్ తప్పిదాలే బీజేపీ గెలుపుకు కారణం … ఒవైసీ

Ram Narayana

విజయ్ ప్రచార సభ తొక్కిసలాట.. 36కి చేరిన మృతులు, ప్రధాని మోదీ సంతాపం

Ram Narayana