హిడ్మా పోలీస్ ట్రాప్ లో పడ్డారు..కేశవరావు ద్రోహుల వల్ల చనిపోయారు.. దేవ్ జీ..
హిడ్మా పోలీస్ ట్రాప్ లో పడ్డారు..కేశవరావు ద్రోహుల వల్ల చనిపోయారు.. దేవ్ జీ..
హిడ్మాను చిత్రహింసలకు గురి చేసి చంపేశారు
అగ్రనేత గణపతిని 2023 చివరిసారిగా చూశాను ..
మావోయిస్టు పార్టీ పై నిషేధాన్ని ఎత్తి వేయాలి
జైళ్లలో ఉన్న మావోయిస్టు లను రాజకీయ ఖైదీలుగా గుర్తించాలి …
తాను ఎన్నికల్లో పోటీచేయని ..చట్టపరిధిలో ఉంది ఉద్యమం కొనసాగిస్తా …
దేవ్ జీ ఈ పేరు వినగానే ఒక పులకరింత …దశాబ్దాలుగా అడవుల్లో ఉండి తాము నమ్మిన మార్గం ద్వారా దేశంలో సోషలిజం సాధించాలని అందరికి కూడు , గూడు ఉండే సమాజం నిర్మించాలని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉండి ఇటీవలనే లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పారు తిరుపతి తొలిసారిగా ఇచ్చిన ఇంటర్యూ తన అభిప్రాయాలను మనసులో దాచుకోకుండా కుండబద్దలు కొట్టారు ..హిద్మ పోలిసుల ట్రాప్ లో పడి చిక్కి చనిపోయారని , ఆయన్ను అనేక చిత్రహింసలకు గురిచేశారని అన్నారు..అదే విధంగా తమ కార్యదర్శి నంబాల కేశవరావు ద్రోహుల ఇచ్చిన సమాచారం వల్లనే చనిపోయారని అన్నారు …ఆగనేత గణపతి గత మూడు సంవత్సరాల క్రితం కేంద్ర కమిటీ సమావేశాల్లో కలిశానని తర్వాత చూడలేదని తెలిపారు ..మావోయిస్టు పార్టీ పై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేయాలని కోరారు ..తాను ఎన్నికల్లో పోటీచేయనని పేర్కొన్నారు .చట్టపరిధిలో ఉద్యమాలు చేస్తానని చెప్పారు ..
మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ (తిప్పిరి తిరుపతి) లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఆయుధాలను వదిలేసి ఆయన జన జీవన స్రవంతిలో కలిసిపోయారు. ఆయన ఈరోజు ఒక మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిడ్మా లొంగిపోతానని చెప్పినప్పుడు తాము వారించామని, అయితే పోలీసుల ట్రాప్‌లో పడి ఆయన ప్రాణాలు కోల్పోయారని దేవ్‌జీ అన్నారు. హిడ్మాది వంద శాతం బూటకపు ఎన్‌కౌంటర్ అని, ఆయనను చిత్రహింసలకు గురిచేసి చంపేశారని ఆయన ఆరోపించారు. ‘ఆపరేషన్ కగార్’ సమయంలో బస్వరాజు చేసిన విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోకపోవడం వల్లే ప్రతిఘటన అనివార్యమైందని, ఆ పోరాటంలోనే బస్వరాజును కోల్పోయామని వెల్లడించారు.
మరోవైపు, అగ్రనేత గణపతి గురించి స్పందిస్తూ.. 2023లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో ఆయనను చివరిసారిగా చూశానని, ఆ తర్వాత ఆయనతో సంబంధాలు లేవని దేవ్‌జీ స్పష్టం చేశారు. సమాజంలో దోపిడీ రూపం మార్చుకుందే తప్ప తొలగిపోలేదని… దోపిడీ ఉన్నంత కాలం ఉద్యమం కొనసాగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మావోయిస్టు పార్టీపై నిషేధాన్ని ఎత్తివేసి, జైళ్లలో ఉన్న వారిని రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయ పదవుల కోసం తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని, చట్టం పరిధిలోనే ఉండి ప్రజా సమస్యలపై పోరాడతానని దేవ్‌జీ ప్రకటించారు.