Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మరో నెల పాటు కెనడా -అమెరికా బోర్డర్ మూసివేత

మరో నెల పాటు కెనడా -అమెరికా బోర్డర్ మూసివేత
-మెక్సికో కు అదే నిబంధనలు
కరోనా నేపథ్యంలో మరో నెలపాటు కెనడా -అమెరికా సరిహద్దు రహదారిని మూసివేయాలని రెండు ప్రభుత్వాలు నిర్ణయించాయి. గత సంవత్సరకాలంగా కరోనా మహమ్మారితో ప్రపంచం అతలాకుతలం అవుతున్నవేళ పక్కపక్కనే ఉన్న కెనడా , అమెరికా , మెక్సికో లకు రోడ్ మార్గం ద్వారా వందలాది వాహనాలు ప్రతిరోజూ వెళుతుంటాయి. గత సంవత్సరకాలంగా బోర్డర్ ను మూసి వేశారు.అయితే పరిమితమైన సంఖ్యలో అనుమతి ఉంది. నిత్యావసర వస్తువులు, మెడికల్ , విద్యార్థులు, డ్రైవర్లు , ఎమర్జెన్సీ వర్కర్లు , అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లేందుకు అనుమతి ఉంది. అదికూడా సరైన పత్రాలు చూపిస్తేనే . జో బైడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత కెనడా, మెక్సికో తో రోడ్ మార్గం ద్వారా నిషేధం పై సమీక్షించారు. ఇంకా కరోనా మహమ్మారి ప్రమాదం ఉన్నందున మరో నెల రోజులపాటు సరిహద్దును మూసివేయాలని నిర్ణయించారు. మూడు దేశాల విదేశాంగ శాఖల ఆధ్వరంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కెనడా సరిహద్దు నిషేధాన్ని ఎత్తివేయాలనే ఉత్సహాన్ని కనబరిచినప్పటికీ అమెరికా అధికారుల విజ్ఞప్తి మేరకు తమ నిర్ణయాన్ని సైతం వాయిదా వేసుకున్నారు. అయితే దేశంలో వివిధ రాష్ట్రాలలో ఉన్న నిబంధనలు సడలించినప్పటికీ టొరంటో , పీల్ ప్రాంతాలలో మార్చ్ 8 వరకు కోవిద్ నిబంధనలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. అయితే స్టే హెట్ హోమ్ నిబంధనలను సడలించినట్లు తెలిపారు. కానీ బార్లు, రెస్టారెంట్లు , ఇతర వాణిజ్య వ్యాపార లావాదేవీలు మరికొద్ది రోజులు పాటు ఈ రెండు ప్రాంతాలలో ప్రజలు ఓపిక పట్టాలని అన్నారు. మెడికల్ అధికారుల సూచన మేరకు కోవిద్ నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అయితే మిగతా ప్రాంతాలలో షాపులు , స్కూల్స్ , ఫ్యాక్టరీలు, అన్ని పనిచేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అమెరికా సరిహద్దు ను మరో నెల మూసివేయటంతో పాటు , మిగతా దేశాలనుంచి వచ్చే ప్రయాణికులకు నిబంధనలు ఏప్రిల్ 21 అమలులో ఉంటాయన్నారు. అన్ని విమానాశ్రయాలను మూసివేశామని ,కేవలం నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలకు మాత్రమే అనుమతి ఉందని అన్నారు. వాటిలో కూడా కోవిద్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం విమానాశ్రయాలలో కోవిద్ టెస్ట్ చేస్తుందని, ఆ రిపోర్ట్ వచ్చే వరకు ప్రభుత్వం అనుమతి పొందిన హోటల్లో ప్రయాణికులు తమ స్వంత ఖర్చులతో బస చేయాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. మెక్సికో,కరీబియన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పై నిషేధం ఉందన్నారు.

Related posts

ట్రాఫిక్ చలానాల రాయితీ గడువు 15 రోజుల పొడిగింపు – హోంమంత్రి!

Drukpadam

తరిగిపోతున్న వేప సంపద.. ఎకరాకు 20 చెట్లున్నా.. రూ.15 వేల ఆదాయం!

Drukpadam

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు టెక్ రవి మృతి..

Drukpadam

Leave a Comment